బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడా అన్న ప్రేక్షకుల ఆలోచనలకు ఏమాత్రం అందకుండా మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేశాడు. డివివి దానయ్య నిర్మాణంలో ఆర్.ఆర్.ఆర్ అంటూ మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. రియల్ హీరోస్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల పాత్రల్లో రాం చరణ్, ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు.  


ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు. ఇదిలాఉంటే ఈ సినిమా విషయంలో రాజమౌళి లెక్క తప్పుతుందని వార్తలు వస్తున్నాయి. సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి అడ్డంకులు వస్తున్నాయి. 


ఇద్దరు హీరోలకు షూటింగ్ లో గాయాలవడం.. ఒక హీరోయిన్ సినిమా నుండి ఎక్సిట్ అవడం.. ఇలా అన్ని సినిమాకు అడ్డుగా మారాయి. రాజమౌళి కూడా ఈ సినిమా మీద ఫోకస్ ఎంత పెడుతున్నా ఏదో ఒక వైపు నుండి అడ్డకులు వస్తున్నాయట. అయితే జక్కన్న ఒక్కసారి ఫిక్స్ అయితే ఎలా ఉంటుందో తెలిసిందే. అందుకే సినిమాపై మరింత దృష్టి పెడుతున్నాడట.  


సాహో ట్రైలర్ రిలీజైన రాజమౌళి ఒక్క మెసేజ్ కూడా పెట్టకపోవడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ జాప్యం వల్ల రాజమౌళి కాస్త చిరాకులో ఉన్నాడట. అందుకే సాహో ట్రైలర్ చూసి పర్సనల్ గా ప్రభాస్ కు కాల్ చేసి విష్ చేశాడట. మరి రాజమౌళిని ఇన్ని ఇబ్బందులు పెడుతున్న ఆర్.ఆర్.ఆర్ అవుట్ పుట్ ఎలా ఉంటుంది. కచ్చితంగా మరోసారి తన సత్తా చాటేలా జక్కన్న చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి. చరణ్, తారక్ ఇద్దరు కలిసి చేయడం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.  




మరింత సమాచారం తెలుసుకోండి: