ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఆమె లేడీ క్రికెట‌ర్ అవ్వాల‌న్న కోరిక‌తో త‌న తండ్రి స‌హాయంతో క్రికెట్‌లోకి వెళ్ళే పాత్ర‌లో క‌నిపిస్తుంది ఐశ్వ‌ర్య‌రాజేష్‌, తండ్రి పాత్ర‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ క‌నిపిస్తారు. వీరిద్ద‌రి మ‌ధ్య సాగే ఎమోష‌న్సే కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి. ఇది త‌మిళ్‌లో ఖ‌ణ గా విడుద‌లై మంచి హిట్ ను సాధించింది.  ఈ చిత్రానికి భీమ‌నేని శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ఫ‌ణ‌లో కె.ఎ. వ‌ల్ల  నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు ఆగ‌స్ట్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో... 

కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ``మా సినిమాలో ఐశ్వ‌ర్య‌, రాజేంద్ర్ర‌ప్ర‌సాద్ పాత్ర‌లే హీరోలు. ఐశ్వ‌ర్య చాలా గొప్ప‌గా, అద్భుతంగా న‌టించింది. మా సినిమా ఎప్పుడో సిద్ధ‌మైన‌ప్ప‌టికీ, ప్ర‌తి వారం ఎన్నో కొన్ని సినిమాలు విడుద‌లకు ఉండ‌టం వ‌ల్ల మేం విడుద‌ల చేయ‌కుండా ఆగాం. ఆగ‌స్టు 23న పెద్ద సినిమాలు లేవ‌ని, మా సినిమానే పెద్ద సినిమా అవుతుంద‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు చెప్పారు. ఈ సినిమాను రెండున్న‌ర గంట‌ల సేపు ఐశ్వ‌ర్య త‌న భుజాల‌పై మోసింది. పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. తెలుగులోనూ పెద్ద హిట్ కావాలి. భీమినేని గారు ప్ర‌తి ఫ్రేమ్‌ను ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దారు. హ‌నుమాన్ చౌద‌రి రాసిన మాట‌లు చిత్రానికి హైలైట్ అవుతాయి`` అని అన్నారు. అలాగే ఐశ్వ‌ర్య‌ర‌జేష్ తెలుగమ్మాయి అయి ఉండి కూడా వేరే భాష‌ల్లోనే ఆమె ఎక్కువ సినిమాల్లో న‌టించింది.  తెలుగులో ఇన్ని చిత్రాల త‌ర్వాత అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగ‌మ్మాయిల‌కి ఎక్కువ అవ‌కాశాలు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

భీమినేని మాట్లాడుతూ ``థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. పాట‌ల‌కు మంచి వ్యూస్ వ‌చ్చాయి. మంచి సినిమా అవుతుంద‌నే ప్యాష‌న్‌తో చేశాం. ఈ మ‌ధ్య కాలంలో చిన్న చిత్రాల‌ను, కంటెంట్ ఉన్న చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించే తీరు చాలా బావుంది. ఈ సినిమాను క్లోజ్డ్ స‌ర్కిల్ లో కొన్ని ఫ్యామిలీస్‌కి చూపించాం. ప్ర‌తి ఒక్క‌రూ మైన్యూట్ థింగ్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్ర‌తి విష‌యాన్నీ చాలా కేర్‌ఫుల్‌గా తెర‌కెక్కించాం. మా నిర్మాత‌గారు త‌మిళంలో ఈ సినిమా చూసి ఇన్‌స్ప‌యిర్ అయి, తెలుగులో క్వాలిటీగా నిర్మించారు. ఈ నెల 18న ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హిస్తాం`` అని తెలిపారు.

హ‌నుమాన్ చౌద‌రి మాట్లాడుతూ ``నేను భీమినేని సార్‌తో `సుడిగాడు` చిత్రానికి ప‌నిచేశాను. ఆ త‌ర్వాత ఆయ‌నతో క‌లిసి ప‌నిచేయ‌డం ఇదే. మ‌ధ్య‌లో `కెజీఎఫ్‌`కు నేను రాసిన డైలాగుల‌కు మంచి పేరు వ‌చ్చింది. `కౌస‌ల్య కృష్ణ‌మూర్తి` మంచి క‌థ‌. తండ్రీ - కూతుర్లు ఒక‌రికొక‌రు చేసుకునే స‌హ‌కారం, ఎద‌గాల‌ని ప‌డే తాప‌త్ర‌యం ఆక‌ట్టుకుంటాయి`` అని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: