ఇటీవల సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం విపరీతంగా పెరిగిన తరువాత సినిమా వాళ్ళు కూడా అందరి మాదిరిగానే వాటిని తమ సినిమా పబ్లిసిటీకి బాగానే వాడుకుంటున్నారు. అయితే ఏదైనా సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ముందస్తు అనౌన్స్మెంట్ చేసినపుడు, ఆ సినిమాకు సంబందించిన విషయాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలనే ఆత్రుత మనలోని చాలా మందికి ఉంటుంది. అయితే అది సినిమాలకు ఇటీవల కొద్దిగా సమస్యలు తెచ్చేదిగా కూడా పరిణమించినట్లు చెప్తున్నారు సినిమా విశ్లేషకులు. ఇక విషయంలోకి వెళితే, లేటెస్ట్ గా అల్లు అర్జున్, మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడవ సినిమాగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో అలానే బన్నీ ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలున్న విషయం తెలిసిందే. 

అయితే ఆ సినిమా అధికారిక టైటిల్ ని ఈనెల 15న ప్రకటిస్తాం అని ఇటీవల సినిమా యూనిట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇక ఈ సినిమా టైటిల్ పై నిన్నటి నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో రగడ జరుగుతోంది. అదేమిటంటే, ఆ సినిమా టైటిల్ 'వైకుంఠపురంలో' అని దాదాపుగా నిశ్చయించడం జరిగిందని పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ సినిమాకు టైటిల్ అసలు అదే నిర్ణయించారా లేకా వేరేదా అనే విషయం కాసేపు అటుంచితే, ఈ సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అవడంతో ఏదైనా సినిమాకు సంబందించి అనౌన్స్మెంట్ వచ్చి, ఫలానా తేదీన మా సినిమాకు సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్ వంటివి విడులా చేస్తాం అని ఆ సినిమా యూనిట్ చెప్తున్నప్పటికీ, అదే సినిమాకు సంబందించి పనిచేస్తున్న కొందరు వ్యక్తులు లేదా ఇండస్ట్రీలో అందరితో మంచి పరిచయాలున్న వారు వాటిని ముందుగానే లీక్ చేస్తుండడంతో, అది పూర్తిగా ఆ సినిమా యూనిట్ నుండి అధికారికంగా బయటకు వచ్చేలోపే రివీల్ అవుతూ, ప్రేక్షకులకు ఆ థ్రిల్ ని మిస్ చేస్తోంది. 

ఇక దీనిపై కొందరు ప్రముఖ సినీ విశ్లేషకులు మాట్లాడుతూ, ఏదైనా ఒక సినిమాకు సంబంధించి అన్ని విషయాల అధికారిక ప్రకటనకు సంబంధించి ముందస్తు అనౌన్సుమెంట్ బాగుంటుందని, కానీ అదే టైటిల్ ప్రకటన విషయం అయితే మాత్రం, పొడిగించకుండా అప్పటికపుడు సడన్ గా ప్రకటిస్తేనే బెటర్ అని, అప్పుడే ఆడియన్స్ లో ఆ సినిమాపై ఉండే హైప్ మరింత పెరుగుతుందని అంటున్నారు. అయితే వారు అంటున్న దానిలో కూడా కొంత నిజం లేకపోలేదని, మరి ఈ విధానాన్ని మన సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు ఎంతవరకు పఠిస్తారో చూడాలి అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: