టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కి మొదట్లో కథ మరియు మాటల రచయితగా పరిచయం అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్, తన డిఫరెంట్ వే ఆఫ్ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకులు మనసులు గెలుచుకున్నారు. ఇకపోతే 2002లో తరుణ్, శ్రియల కలయికలో తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తరువాత 2005లో లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన అతడు సినిమాను తెరకెక్కించారు. ఇక ఆయన తీసిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో టాలీవుడ్ లో త్రివిక్రమ్ కు దర్శకుడిగా అవకాశాలు పెరిగాయి. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ తో తీసిన జల్సా తో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్, 

ఇటీవలి ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత సినిమా వరకు, కొన్ని హిట్స్ తో పాటు ఫ్లాప్స్ ను కూడా చవి చూసారు. ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అల వైకుంఠపురంలో అనే సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్, ఈ సినిమాను అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారట. ఇకపోతే ఈ సినిమాకు అల వైకుంఠపురం అనే టైటిల్ పెట్టడానికి కూడా ఒక కారణం లేకపోలేదని నేడు ఉదయం నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు విపరీతంగా షికారు చేస్తున్నాయి. అదేమిటంటే, గతంలో త్రివిక్రమ్ తీసిన సినిమాల్లో ఎక్కువగా అ అనే అక్షరంతో తీసిన అతడు, అత్తారింటికి దారేది, అఆ, అరవింద సమేత వంటి సినిమాలు మంచి విజయవంతం అయ్యాయని, 

కాబట్టి ఆయన ఈ లేటెస్ట్ సినిమాకు కూడా అ అనే అక్షరంతోనే టైటిల్ ని నిర్ణయించడం జరిగిందని అంటున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ తో ముచ్చటగా మూడవసారి త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి సినిమా టాలీవుడ్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచినప్పటికీ, ఆ సినిమాతో వచ్చిన నెగటివిటీని మరొకసారి తన సినిమాకు అ అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్ పెట్టి, ఈ సారి గట్టిగా హిట్ కొట్టాలని సంకల్పించారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతన్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, త్రివిక్రమ్ కెరీర్ లో తీసిన సినిమాలను బట్టి చూస్తుంటే అది కొంతవరకు నిజమేనని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: