ఈ మద్య కాలంలో అన్ని ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ఈ రోజు తెలుగు ప్రముఖ గేయ, మాటల రచయిత శివగణేష్ మరణ వార్త మరువక ముందే బాలీవుడ్ ప్రముఖ నటి విద్యా సిన్హా(71) ముంబై జుహూ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యతో ఎంతో బాధపడుతున్నారట..ఇందుకోసం వైద్య చికిత్స కూడా తీసుకుంటున్నారట.  విద్యా సిన్హా `రజనీగంధ`, `చోటీ సీ బాత్`, `పతి పత్నీ ఔర్ వో` టాప్ చిత్రాల్లో నటించి మెప్పించారు.  అప్పట్లో ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారట..ఫ్యాన్ ఫాలోయింగ్ విద్యాసిన్హాకు బాగానే ఉండేవారట. 

నటి  విద్యా సిన్హా నవంబర్ 15, 1947లో జన్మించారు.  అప్పట్లోనే ఆమె మోడల్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారట..ఆ రంగంలో ఉంటూనే నటనపై దృష్టి పెట్టారంట. దర్శక,నిర్మాతల దృష్టిని ఆకర్షించిన విద్యాసిన్హా  పెళ్లి తర్వాతే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.  ‘రాజాకాక’ చిత్రంతో ఆమె తన కెరీర్ మొదలు పెట్టారు. మొదటి చిత్రంతో మంచి గుర్తింపు రావడం..నటిగా ఆమె ఎంతో మంది హృదయాలు గెల్చుకోవడం జరిగిందట. అయితే 1986లో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.

కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కోసం  2011లో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన `బాడీగార్డ్` చిత్రమే ఈమె చివరి చిత్రం.   విద్యా సిన్హా కేవలం వెండి తెరపైనే కాదు..బుల్లి తెరపై కూడా సత్తా చాటారు.  ఆమె చివరి దశలో కూడా నటించి అందరి మన్ననలు పొందింది.  విద్యా సిన్హా మరణ వార్త విన్న బాలీవుడ్ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: