దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ నిర్మించిన సాహో సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ప్రభాస్, శ్రధ్ధా కపూర్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 30 వ తేదీన విడుదల కాబోతుంది. దర్శకుడు సుజీత్ ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. బాహుబలి, బాహుబలి2 లాంటి ఇండస్ట్రీ హిట్ల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా ఫలితంపై ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 
 
సాహో సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రుపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల శాటిలైట్, డిజిటల్ రైట్స్ 60 కోట్ల రుపాయలకు సన్ నెట్ వర్క్ చేజిక్కించుకుందని సమాచారం. హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కులు 40 కోట్ల రుపాయలకు అమ్మినట్లు తెలుస్తుంది. సాహో థియేట్రికల్, శాటిలైట్ రైట్స్ కలిపి 400 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 
 
సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18వ తేదీన రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతుంది. శ్రేయాస్ మీడియా ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తోంది. దాదాపు లక్ష మంది అభిమానులకు సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ పాసులు ఇస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సాహో నిర్మాతలు కోటీ 70 లక్షల రుపాయలు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం అందుతుంది. 
 
సాహో సినిమా భారతదేశంలో 7000 థియేటర్లలో, ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్లలో విడుదల కాబోతుంది. సాహో సినిమా తరువాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. వరుసగా భారీ సినిమాలలో నటించటం వలన సినిమా సినిమాకు గ్యాప్ ఎక్కువగా వస్తుండటంతో సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటానని మీడియాతో ప్రభాస్ చెప్పాడు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: