సాయిపల్లవిని చూసినపుడు ఎవరికైనా ఆమె హీరోయిన్ అన్న  భావన కలగదు. ఆమె మన పక్కింటి అమ్మాయి అని మాత్రమే ఆలోచన వస్తుంది. ఇక వెండి తెర మీద సాయిపల్లవి నటన కూడా సహజంగానే ఉంటుంది. ఆమె పాత్రలో లీనమయ్యే విధానం అలా ఉంటుంది. ఓ విధంగా చెప్పుకోవాలంటే అలనాటి నటీమణుల టాలెంట్ పూర్తిగా సాయిపల్లవిలో ఉంది.


ఆమె ఫిదా మూవీ చూసి ఫిదా కానీ  వారు ఎవరూ ఉండరు. సెలెక్టివ్ గా మూవీస్ చేస్తూ అందులో తన పాత్రను చక్కగా చేసుకుంటూ వెళ్ళ సాయిపల్లవి అంటే ఇండస్ట్రీలోనూ ఓ గొప్ప భావన ఉంది. ఆమె కోసం కధలు తయారు చేసే దర్శకులు ఉన్నారు. ఇపుడు సాయిపల్లవి మరో మారు ఫిదా చేయనుందని టాక్. ఆమెను ఫిదాలో మామూలు అమ్మాయిగా చూపించిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఇపుడు గొప్ప క్లాసికల్ డ్యాన్సర్ గా చూపించబోతున్నారుట.


ఈ కొత్త  మూవీలో సాయిపల్లి అద్భుతమైన న్రుత్య రీతులతో మొత్తం కధనే తన వైపు తిప్పుకుంటుంది. ఓ విధంగా చెప్పాలంటే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఈ మూవీతో సాయిపల్లవి మంచి పెర్ఫార్మెన్స్ చేసేందుకు స్కోప్ ఉందని అంటున్నారు. ఆమెకు జోడీగా  అక్కినేని నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ ఇద్దరి జోడీ ఫ్రెష్ గా ఉంటుంది. నాగ చైతన్యకు కూడా నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రట.


ఈ మూవీ షూటింగ్ ఈ నెల 25 నుంచి మొదలవుతుంది. ఈ మూవీని వచ్చే ఏడాది మొదటిలో రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ ఖరార్ చేశారు. శేఖర్ కమ్ముల, సాయి పల్లవి  మరో మారు ఈ కాంబో  అంటేనే  ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీ ఎపుడెపుడు వస్తుందా అన్న ఆసక్తి కూడా జనంలో కనిపిస్తోంది. మొత్తానికి సాయిపల్లవి సరైన మూవీతోనే జనాల్లోకి వస్తోందన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: