బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి2 సినిమాలలో ప్రభాస్, అనుష్క జంటగా నటించారు. నాలుగు సినిమాల్లో ప్రభాస్, అనుష్క కలిసి జంటగా నటించటంతో వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియాలో ప్రభాస్, అనుష్క ఇద్దరూ కలిసి ఖరీదైన ఇల్లు కొన్నారని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రభాస్, అనుష్క ఒకరికొకరు టచ్ లో ఉన్నారని, ఇటీవలే ఇద్దరూ కలిసి సాహో సినిమా ఫైనల్ కట్ చూసారని, ఇద్దరూ కలిసి ఉండటం కోసం లాస్ ఏంజిల్స్ లో ఇల్లు కొన్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ సాహో సినిమా ప్రమోషన్ల కోసం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సాహో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ కు అనుష్క గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 
 
మీడియా ప్రభాస్ తో అనుష్కతో మీరు డేటింగ్ లో ఉన్నారట నిజమేనా? త్వరలో మీరు అనుష్క పెళ్ళి చేసుకోబోతున్నారట కదా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ప్రభాస్ మీడియాకు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. ఇప్పటికే ఈ విషయం గురించి చాలాసార్లు చెప్పాను. మరోసారి చెబుతున్నాను. అనుష్క నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. గత రెండేళ్ళలో మేమిద్దరం కలిసి ఎక్కడైనా కనిపించామా? అనుష్కను రెండు సంవత్సరాల నుండి కలవలేదు అని ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. 
 
గతంలో అనుష్కకు కూడా మీడియా నుండి ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే ప్రభాస్ కు తనకూ మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని, మేమిద్దరం మంచి స్నేహితులమని అనుష్క క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ నటించిన సాహో సినిమా ఆగస్ట్ 30 వ తేదీన విడుదల కాబోతుంది. 350 కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించారు. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ శ్రధ్ధా కపూర్ నటిస్తోంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: