మెగస్టార్ చిరంజీవి వేసిన పూల బాటలో నడుస్తున్న మెగా హీరోలు.. హీరోలుగా ఎంట్రీ సులువుగా దొరికినా సరే వారి టాలెంట్ తోనే కెరియర్ నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా అందరిది ఒకదారి అయితే తనది ఒకదారి అటూ మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమా సినిమాకు ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ కు గురి చేస్తున్నాడు.     


మెగా ఫ్యామిలీ హీరోగా సేఫ్ సైడ్ ఉండే సినిమాలను చేస్తూ కెరియర్ మెయింటైన్ చేయొచ్చు కాని వరుణ్ తేజ్ అలా కాదు. తన మొదటి సినిమా ముకుంద నుండి కొత్తగా ప్రయత్నిస్తున్నాడు. కంచె సినిమాతో హిట్ అందుకున్నాడు. మొదటి కమర్షియల్ హిట్ అందుకుంది మాత్రం ఫిదా సినిమాతోనే. ఆ తర్వాత తొలిప్రేమ, ఎఫ్-2 సినిమాలు వరుణ్ తేజ్ కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలు గా నిలిచాయి.


ప్రస్తుతం వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అతనిది నెగిటివ్ రోల్ అని తెలిసిందే. నిన్న రిలీజైన వాల్మీకి టీజర్ చూస్తే వరుణ్ తేజ్ కూడా మంచి నటుడిగా ఆవిష్కృతమైనట్టు తెలుస్తుంది. ఎంచుకున్న పాత్ర ఎలా ఉన్నా ఆ పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేయడమే నటుడి యొక్క బాధ్యత. వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ అదరగొట్టాడని చెప్పొచ్చు. సినిమాలో మరో హీరోగా అధర్వ నటిస్తున్నాడు.


అయితే టీజర్ చూస్తే మాత్రం మొత్తం కాన్సెంట్రేషన్ వరుణ్ తేజ్ మీదనే ఉంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ ప్లాన్ చేశారు. ఎప్పుడు వరుణ్ తేజ్ ను ఇలాంటి రఫ్ లుక్ లో చూడలేదు. టీజర్ లో శాంపిల్ చూపించి అదరగొట్టిన వరుణ్ తేజ్ సినిమాలో చెలరేగిపోయాడనిపిస్తుంది.     
 


మరింత సమాచారం తెలుసుకోండి: