టాలీవుడ్ లో స్టార్ హీరోల కుమారులు హీరోగా గా వస్తున్న విషయం తెలిసిందే.  ఈ ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతున్నదేమీ కాదు. ఒకప్పుడు తెలుగు చిత్ర సీమను ఏలిన మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తరం హరికృష్ణ, బాలకృష్ణలు హీరోగా వస్తే..అక్కినేని నటవారసుడిగా ‘విక్రమ్’ సినిమాతో నాగార్జున తన ప్రస్థానం మొదలు పెట్టారు.  మొదటి సినిమా పెద్దగా హిట్ కాకపోయినా తర్వాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయింది. 

శివ లాంటి యాక్షన్ మూవీ తర్వాత నాగార్జున్ లవ్, ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు.  అయితే ఇప్పటి వరకు ఎంత మంది హీరోలు ఎన్ని పాత్రలు వేసినా..నాగార్జున కొన్ని పాత్రల్లో చరిత్ర సృష్టించారు.  అన్నమయ్య,భక్తరామదాసు,సాయిబాబా ఇలా ఎప్పటికీ మర్చిపోలేని పాత్రల్లో నటించి మెప్పించారు. తాజాగా ఆయన నటించిన ‘మన్మథుడు 2 ’ సినిమా రిలీజ్ అయినా పెద్దగా హిట్ టాక్ పడలేదు.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీనితో మూవీ వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు.

అయితే మూవీని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రమోషన్ చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో నాగార్జున పలు ఛానల్స్ లో మాట్లాడారు.  తాజాగా మీకు మీ తండ్రి గారు కాకుండా చిత్రపరిశ్రమలో ఏ హీరో ఇన్స్పిరేషన్ ఎవరు అని అభిమాని ప్రశ్నించగా.. చిరంజీవి అంటూ నాగ్ వెంటనే సమాధానం ఇచ్చాడు. చిరంజీవి ఎందుకు తనకు ఆదర్శమో కూడా నాగ్ వివరించాడు. దానికి కారణం చెబుతూ.. గతంలో ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లాంటి వారు నటులు అన్ని రకాల సినిమాలు అంటే పౌరాణికం, జానపద సినిమాల్లో ఎక్కువగా నటించారు. 

అయితే చిరంజీవి, నేను ఒకే జనరేషన్ కు చెందిన వాళ్ళం అందుకే చిరంజీవి గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు రీచ్ అయ్యారో..అందులో ఆయన కష్టం ఎంత ఉందో ప్రత్యక్షంగా చూసిన నాకే తెలుసు.  అందుకే ఆయన నాకు ఎంతో స్ఫూర్తి అన్నారు నాగార్జు. 


మరింత సమాచారం తెలుసుకోండి: