నేచురల్ స్టార్ నాని 24 చిత్రంగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘గ్యాంగ్ లీడర్’ సెప్టెంబర్ 13న విడుద‌ల కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌‌పై తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఆగ‌ష్టు 30న విడుద‌ల చేద్దామ‌ని ఫిక్స్ చేసుకుంటే సాహో వాయిదా ప‌డ‌డంతో ప్ర‌స్తుతం ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13కి వెళ్లింది. ఈ సినిమాలో గ్యాంగ్‌కి ‘గ్యాంగ్ లీడర్’ రోల్‌లో నేచురల్ స్టార్ నాని క‌నిపిస్తాడు. ఇక విక్ర‌మ్ కె.కుమార్ సినిమాలంటే ఎంత వైవిధ్యంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.


హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ నెగిటివ్ క్యారెక్ట‌ర్‌తో చేస్తున్న సినిమా `వాల్మీకి`. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.  ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 లాంటి సినిమాల తర్వాత వరుణ్ చేస్తున్న సినిమా వాల్మీకిపై బాగానే అంచ‌నాలు ఉన్నాయి. తమిళ జిగర్తాండా చిత్రానికి తెలుగు రీమేక్ గా వాల్మీకి తెరకెక్కుతుంది. ఈ సినిమాను ముందుగా సెప్టెంబ‌ర్ 6న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ సాహో వాయిదా ప‌డ‌డంతో... మ‌రీ సాహో వ‌చ్చిన వారం రోజుల‌కు రిలీజ్ చేయ‌డం ఎందుకులే అని సెప్టెంబ‌ర్ 13కు ఫిక్స్ అయ్యారు.


ముఖ్యంగా వాల్మీకి చిత్రంలో వరుణ్ తేజ్ లుక్స్ ఓ రేంజ్‌లో మెగా ఫ్యాన్స్‌ను ఆక‌ర్షించాయి. అయితే అటు నాని `గ్యాంగ్ లీడ‌ర్‌` మ‌రియు ఇటు వ‌రుణ్‌ `వాల్మీకి` ఒకే రోజు పోటీ ప‌డ‌నున్నాయి. నిజానికి కంటెంట్ పరంగా చూసుకుంటే ఇటు నాని సినిమా మ‌రియు అటు వరుణ్ తేజ్ సినిమాలు పూర్తిగా భిన్నమైనవి. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు, మ‌రియు ఫ‌స్ట్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకున్నాయి.  


సోలో రిలీజ్ గా 'వాల్మీకి'ని బరిలోకి దింపాలని హరీశ్ శంకర్ అనుకుంటే.. ఇప్పుడు పోటీగా ' గ్యాంగ్ లీడర్‌ 'వచ్చింది. ఈ క్ర‌మంలోనే బాక్సాఫీస్ వ‌ద్ద రెండు సినిమాల‌ మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏ సినిమా ఎక్కువ మార్కులు వేయించుకుంటుందో సెప్టెంబ‌ర్ 13 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: