తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికీ నాలుగోవారం నడుస్తుంది.  మొదటి  నుంచి బిగ్ బాస్ పై ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. అన్నీంటిని ఛేదించుకొని బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంట్రటైన్ చేస్తుంది. ఇక వీక్ ఎండ్ కి నాగార్జున తన పండుతో రావడం ఎంట్రటైన్ చేయడం..ఒకరిని ఎలిమినేషన్ చేయడం జరుగుతుంది. బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి ఎలిమినేషన్ అయ్యారు. అయితే బిగ్ బాస్ హౌజ్ నుంచి మొట్టమొదట నటి హేమ ఎలిమినేషన్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

కాకపోతే ఆమె చేసిన పనులు ఇంటి సభ్యులకు నచ్చకపోవడం వల్లనే తనను ఓటింగ్ కి నామినేట్ చేశారని.. గేమ్ పై అప్పటికే ఇంకా అవగాహన రాకపోవడం ఒక కారణం అని హేమ అన్నారు.  మొదటి నుంచి జర్నలీజ్ ఫీల్డ్ లో ఎప్పుడూ సీరియస్ గా ఉంటూ ఎన్నో కాంట్రవర్సీ ఇంటర్వ్యూలను చేసిన జాఫర్ బిగ్ బాస్ ఇంటిలో మాత్రం ఎక్కువగా ఎంట్రటైన్ చేయలోక పోవడం ఆయనకు మైనస్ గా మారింది. దాంతో ఆయనకు కూడా తక్కువ ఓటింగ్స్ పడ్డాయి.  ఇక హేమ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్న ఉన్నన్ని రోజులు రచ్చ రచ్చ చేయడం..ఇంటి సభ్యుల ఆగ్రహానికి గురి కావడంతో ఆడియన్స్ కూడా ఆమెను రిజక్ట్ చేశారు.

నిన్న బిగ్ బాస్ లో పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్నారు. స్కిట్ లు డాన్స్ లతో పాటు భారత్ మాతాకి జై అనే నినాదాలతో హోరేత్తించింది. మొదట శ్రీముఖి, అలీలు యాంకర్లుగా వ్యవహరిస్తూ ఆనంద పరిచారు. స్త్రీ, పురుష సమానత్వంపై మహేష్, రవి, పునర్నవి, వితికా, అషు‌లు స్కిట్ తో ఆకట్టుకున్నారు. ఆడవాళ్లు గొప్పా, మగవాళ్ల గొప్పా అన్ని విషయంపై కంటెస్టంట్స్ తమ అభిప్రాయాలను వివరించారు.  ఇక మగాళ్లు పడుతున్న కష్టాలు..వారి గొప్పతనం గురించి రవి, మహేష్ లు తమ వాదన వినిపించగా వాళ్లకు కౌంటర్ ఇస్తూ అషు, వితికా చెలరేగిపోయారు.

చివరగా పునర్నవి తన మాటలతో ఆవేశంగా మాట్లాడింది. ఆడవాళ్లు ఎందుకు మాట్లాడకూడదు.. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎందులో తక్కువ అంటూ రెచ్చిపోయింది.  ఒక అబ్బాయి ఎంత మంది అమ్మాయిలతో అయినా మాట్లాడొచ్చు..ఎంట్ర టైన్ చేయొచ్చు, కానీ ఒక అమ్మాయి మాత్రం పది మంది అబ్బాయిలతో మాట్లాడితే ఆమె క్యారెక్టర్ లెస్ అని చిత్రీకరిస్తారు. ఇది సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్తుందా వెనక్కి తీసుకు వెళ్తుందా..అడవాళ్లు మాగళ్లతో సమానంగా అన్ని రంగాల్లో ఉన్నారు..ఇదీ అమ్మాయిలకు ఇచ్చే గౌరవం అంటూ ఆవేశంగా మాట్లాడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: