టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నటుడిగా ప్రవేశించిన అడివి శేష్ కు, మంచి నటుడిగా గుర్తింపునిచ్చిన సినిమాలు పంజా, బాహుబలి, దొంగాట ముందు వరుసలో ఉంటాయనే చెప్పాలి. అయితే ఆ తరువాత తనలోని మరొక కోణాన్ని బయటకు తీసిన శేష్, రచయితగా కూడా పనిచేయడం మొదలెట్టారు. ఆపై కొన్నాళ్ళకు పివిపి సంస్థ నిర్మాణంలో రవికాంత్ దర్శకత్వంలో తానే స్వయంగా కథ, కథనాలు సమకూర్చుకుని హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా క్షణం. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి నటుడిగా, రచయితగా అడివిశేష్ కు అతి పెద్ద బ్రేక్ ని ఇంచిందనే చెప్పాలి. 

ఇకపోతే ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీతో తన తదుపరి కూడా మంచి సస్పెన్స్ జానర్ లో చేయాలని నిర్ణయించిన శేష్, గూఢచారి కథను రూపొందించి హీరోగా నటించడం జరిగింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో, శేష్ కు టాలీవుడ్ లో మరింతగా అవకాశాలు పెరిగాయి. ఆ తరువాత మహేష్ బాబు సొంత బ్యానర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ పై మేజర్, అలానే గూఢచారి 2, మరియు పివిపి నిర్మాణంలో ఎవరు సినిమాల్లో నటించడానికి శేష్ కు అవకాశం వచ్చింది. ఇక వీటిలో ముందుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఎవరు సినిమా, మంచి అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్ డూపర్ హిట్ గా దూసుకెళ్తోంది. ఇకపోతే ఈ సినిమా కథను కూడా శేష్ అందించడం జరిగింది. నూతన దర్శకుడు వెంకట్ రామ్ జి ఈ సినిమాను ఎంతో అద్భుతమైన స్క్రీన్ ప్లే మరియు ఆకట్టుకునే సస్పెన్స్ సీన్స్ తో ట్రెమండస్ గా తెరకెక్కించాడని అంటున్నారు ప్రేక్షకులు. 

సినిమాలో నటీనటుల సహజమైన నటన, అక్కడక్కడా వచ్చే ట్విస్టులు మరియు ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్, అలానే ఆడియన్స్ కి మంచి ఫీల్ ని ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వెరసి ఎవరు మూవీని సూపర్ హిట్ టాక్ తో ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇక నేటి రెండవ రోజున తమకు అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా మరింతగా కలెక్షన్ల జోరు చూపిస్తోందని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. మరోవైపు శర్వానంద్ రణరంగం సినిమా కూడా మంచి టాక్ తో దూసుకుపోతున్నప్పటికీ, ఎవరు మరింత పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోందని, దీన్నిబట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింత అద్భుతంగా కలెక్షన్స్ సంపాదించే అవకాశం ఉందని వారు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎవరు ఎంతటి విజయాన్ని అందుకుని ఎంతమేర కలెక్షన్ రాబడుతుందో వేచి చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: