ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా సైమా ( సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ ) ఫంక్షన్ కతార్ లోని దోహాలో ఎంతో అత్యద్భుతంగా జరుగుతోంది అనే చెప్పాలి. ఆగష్టు 15వ తేదీన జరిగిన తెలుగు మరియు కన్నడ సినిమాల అవార్డుల వేడుకకు మెగాస్టార్, అలానే నేడు ఆగష్టు 16 వ తేదీన జరిగే తమిళ మరియు మలయాళ సినిమా అవార్డుల వేడుకకు మోహన్ లాల్, చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. ఇకపోతే నిన్నటి ఈ అవార్డు ఫంక్షన్ వేడుకలో పలువురు తెలుగు మరియు కన్నడ నటులు తమ ఆకట్టుకునే డాన్స్ ప్రదర్శనలతో ఆడియన్స్ ను బాగా అలరించడం జరిగింది. గత ఏడాది రిలీజ్ అయి అద్భుత విజయాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు మొత్తం తొమ్మిది విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుని సరికొత్త రికార్డుని నెలకొల్పింది.  

ఈ సినిమాలో చిట్టిబాబుగా నటించి అందరినీ మెప్పించిన రామ్ చరణ్, ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం విశేషం. ఇకపోతే ఇప్పటికే మహానటి సినిమాలో సహజ నటనను ప్రదర్శించినందుకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్, సైమా వారి ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకున్నారు. అంతేకాక ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ సహాయ నటుడిగా రాజేంద్ర ప్రసాద్ అవార్డుతో కలిపి మొత్తం ఈ సినిమా మూడు అవార్డులు గెలుచుకోవడం జరిగింది. ఇక గత ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయి, సూపర్ హిట్ కొట్టిన ఆర్ఎక్స్ 100 సినిమా కూడా మూడు విభాగాల్లో అవార్డ్స్ గెలుచుకుంది. మరి ఈ ఏడాది ఎంతో వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకల్లో తెలుగు సినిమాకు సంబంధించి ఎవరెవరు అవార్డులు అందుకున్నారో క్రింద లిస్ట్ లో తెల్పడం జరిగింది....!!

ఉత్తమ చిత్రం - మహానటి 
ఉత్తమ నటుడు - రామ్ చరణ్ (రంగస్థలం)  
ఉత్తమ నటి - కీర్తి సురేష్ (మహానటి)  
ఉత్తమ దర్శకుడు - సుకుమార్ (రంగస్థలం) 
ఉత్తమ నటి (క్రిటిక్స్) - సమంత (రంగస్థలం) 
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - విజయ్ దేవరకొండ (గీత గోవిందం) 
ఉత్తమ సహాయ నటి - అనసూయ (రంగస్థలం) 
ఉత్తమ సహాయ నటుడు - రాజేంద్రప్రసాద్ (మహానటి) 
ఉత్తమ ఆరంగేట్ర నటుడు - కల్యాణ్ దేవ్ (విజేత) 
ఉత్తమ ఆరంగేట్ర నటి - పాయల్ రాజ్‌పుత్ (ఆర్ఎక్స్100) 
ఉత్తమ ఆరంగేట్ర దర్శకుడు - అజయ్ భూపతి (ఆర్ఎక్స్100) 
ఉత్తమ హాస్యనటుడు - సత్య (ఛలో) 
ఉత్తమ ప్రతి నాయకుడు - శరత్ కుమార్ (నాపేరు సూర్య, నా ఇల్లు ఇండియా) 
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ - దేవిశ్రీప్రసాద్ (రంగస్థలం) 
ఉత్తమ గేయ రచయిత - చంద్రబోస్ (ఎంత సక్కగున్నావే - రంగస్థలం) 
ఉత్తమ నేపథ్య గాయకుడు - అనురాగ్ కులకర్ణి (పిల్లా రా - ఆర్ఎక్స్100) 
ఉత్తమ నేపథ్య గాయని - ఎమ్ఎమ్ మానసి (రంగమ్మ మంగమ్మ - రంగస్థలం) 
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు (రంగస్థలం) 
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ - రామకృష్ణ (రంగస్థలం) 
సోషల్ మీడియా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ - విజయ్ దేవరకొండ 
స్పెషల్ అప్పీరెన్స్ అవార్డ్ (జ్యూరీ) - సుధీర్ బాబు


మరింత సమాచారం తెలుసుకోండి: