ఒక్క సినిమా..ఒకే ఒక్క సినిమా ఛాన్స్ ఇస్తే నేనేంటో నిరూపిస్తా..నా టాలెంట్ ఏంటో చూపిస్తా అనే ఔత్సాహిక కళాకారులు ఫలిమ్ నగర్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు.  ఎంతో మంది టాలెంట్ ఉన్న కళాకారులు స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఎంతో మంది దళారుల చేతుల్లో మోసపోతూనే ఉంటారు.  అయితే వచ్చిన ఛాన్స్ ని వినియోగించుకొని తానేంటో ప్రూఫ్ చేసుకొని ప్రేక్షకుల మనసు దోచే నటులు చాలా తక్కువ మంది ఉంటారు.  అలాంటి వారిలో సంపూర్ణేష్ బాబు ఒకరు.

తన మొదటి సినిమా హృదయకాలేయం సినిమా రిలీజ్ కి ముందు ఓ భూమ్ సృష్టించాడు.  ఇక సినిమా రిలీజ్ అయ్యాక..అందులో కామెడీ చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు ప్రేక్షకులు.  ఆ తర్వాత సింగం 123 సినిమలో హీరోగా నటించాడు. అయితే హీరోగా కన్నా తాను ఒక మంచి కమెడియన్ గా తన సత్తా చూపించాలనుకొన్న సంపూ క్యారెక్టర్ పాత్రల్లో నటించడం మొదలు పెట్టాడు.  ఈ నేపథ్యంలో ఆయన ‘కొబ్బరిమట్ట’ సినిమాలో హీరోగా నటించారు.  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన 'కొబ్బరిమట్ట' సినిమా ఊహించని విధంగా విజయాన్ని అందుకుంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా బీ, సీ సెంటర్స్ లో బాగా ఆడుతోంది.

తాజాగా సంపూర్ణేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  సినిమా విడుదల కోసం పడ్డ కష్టాలు, మూడున్నర నిమిషాల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పడానికి చేసిన హార్డ్ వర్క్, తన రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చారు.  తనకు మోహన్ బాబు అంటే ఎంతో ఇష్టమని.. డైలాగ్స్ చెప్పడంతో మోహన్ బాబు గారు తనకు ఆదర్శమని, ఇంతకముందు ఒకటిన్నర నిమిషం పాటు డైలాగ్ చెప్పానని.. ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి మూడున్నర నిమిషాల్ డైలాగ్ చెప్పినట్లు వెల్లడించారు.

తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ ‘హృదయకాలేయం’సినిమాకు తక్కువ రెమ్యూనరేషనే తీసుకున్నానని..నిర్మాత తనను నమ్మి చేశాడు కాబట్టి రెమ్యూనరేషన్‌ కోసం చూసుకోలేదని అన్నారు. కాగా ‘హృదయకాలేయం’, ‘కొబ్బరి మట్ట’ చిత్రాలతో సంపూ రేంజ్ ఒక్కరోజుకు రెండు నుండి మూడు లక్షలకుఆయన రేటు పెరిగినట్టు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: