సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఆయన కెరీర్ పరంగా ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి సినిమా మే నెల 9వ తేదీన రిలీజ్ అయి, మొదట కొంత మిశ్రమ స్పందన సంపాదించినప్పటికీ, సినిమాలో ఆకట్టుకునే  ఫైట్స్, పాటలు, ఎంటర్టైన్మెంట్ తో పాటు స్నేహ బంధం యొక్క గొప్పదనం మరియు రైతుల గురించిన ఒక అద్భుతమైన మెసేజ్ కు మెల్లగా ప్రేక్షకులు కనెక్ట్ అవడం మొదలెట్టారు. 

ఇక ఆపై మెల్లగా ఊపందుకున్న ఈ సినిమా కలెక్షన్స్, చివరికి మహర్షిని మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా అలానే, టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేలా చేసింది. ఇకపోతే నేటితో గాజువాక, చిలుకరాలూరిపేట, ఆదోని ఇలా మూడు కేంద్రాల్లో డైరెక్ట్ గా శతదినోత్సవాన్ని జరుపుకున్న ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో సంబరంగా నిర్వహిస్తున్నారు. ఇక మరోవైపు తమ సినిమా దిగ్విజయంగా వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం, నిర్మాతలు ఈ సినిమా నుండి ఒక డిలీటెడ్ సీన్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. 

సినిమాలో కాలేజీ ఎపిసోడ్ జరుగుతున్న సమయంలో రిషి (మహేష్ బాబు) హీరోయిన్ పూజతో కలిసి తిరుగుతుండడం గమనించిన అజయ్ (కమల్ కామరాజు), అతడిని అడ్డగించి గొడవపెట్టుకొని కొట్టడం, అతడిని రిషి ప్రతిఘటించడం, ఆపై వారిద్దరి గొడవ ప్రిన్సిపాల్ వరకు చేరడం వంటి సీన్స్ మొత్తం ఈ డిలీటెడ్ సీన్ ఎపిసోడ్ లో వీక్షించవచ్చు. కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజయిన ఈ సీన్, ఇప్పటికే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. వాస్తవానికి అప్పటికే సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో కొన్ని సన్నివేశాలను సినిమా నుండి తొలగించడం జరిగిందని,  సినిమా రిలీజ్ తరువాత వాటిని కూడా రిలీజ్ చేస్తాం అని కొన్నాళ్ల క్రితం దర్శకుడు వంశీ పైడిపల్లి ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: