ఒకప్పుడు విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న దర్శకులు టి.కృష్ణ తనయుడు గోపిచంద్ ‘ తొలివలపు’సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  అన్ని క్వాలిటీస్ ఉన్న హీరోగా మొదటి సినిమాతో పెద్దగా రాణించలేక పోయాడు. అయితే హీరోగానే కాకుండి సినీ పరిశ్రమలో ఎలాగైన తన కెరీర్ సాగించాలని నిర్ణయం తీసుకున్న గోపీచంద్ తర్వాత విలన్ అవతారం ఎత్తాడు. జయం, నిజం, వర్షం లాంటి సినిమాలో విలన్ గా నటించి తానేంటో నిరూపించుకున్నాడు ఆ తర్వాత రణం, యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం సినిమాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు గోపించంద్. 

కొంత కాలంగా గోపిచంద్ నటిస్తున్న సినిమాలేవీ పెద్దగా హిట్ కావడం లేదు.  దాంతో కెరీర్ ఇబ్బందులు ఏర్పడతాయని భావించిన గోపిచంద్ ఈసారి మంచి హిట్ తో అభిమానులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారు.  తాజాగా  గోపీచంద్ రా ఏజెంట్ గా నటిస్తున్న మూవీ చాణక్య. కోలీవుడ్ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ సినిమాపై ఇప్పటికే ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇటీవల ఈ మూవీ షూటింగ్ లో గోపిచంద్ కి తీవ్ర గాయం కావడంతో కొంత కాలం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. చిత్ర యూనిట్ త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ ను దాదాపు ఎండ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవుతుందని గోపీచంద్ కష్టపడుతున్నాడు. ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. త్వరలో టీజర్ కి కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా రేంజ్ ఏంటో టీజర్ లోనే కట్ చేయాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట చిత్ర యూనిట్. టీజర్ ను రిలీజ్ చేసి సినిమా విడుదల తేదీపై కూడా అప్పుడే క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ యాక్టర్ జరీన్ ఖాన్ - మెహ్రీన్ పిర్జాద సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రామ్ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: