ప్రభాస్ కొత్త సినిమా సాహో మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈనెల 18 వ తేదీన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు.  ఇదిలా ఉంటె, బాహుబలి తరువాత ప్రభాస్ కు తమిళనాడులో కూడా మంచి క్రేజ్ పెరిగింది.  సాహో సినిమాను తమిళనాడులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సాహో అక్కడ కూడా రిలీజ్ అవుతుండటంతో సూర్య సినిమా పోస్ట్ ఫోన్ చేసుకున్నారు.  


సూర్య సినిమా పోస్ట్ ఫోన్ చేసుకున్నారు కాబట్టి ఈ సినిమాకు మంచి స్కోప్ ఉన్నది.  అందుకోసమే ఈ సినిమాను అక్కడ ప్రోమోట్ చేసేందుకు సిద్ధం అయ్యారు.  అయితే, ప్రమోషన్ విషయంలో ఇప్పుడు సాహో తలనొప్పులు ఎదుర్కొంటోంది.  తమిళనాడులో నిర్మాతలకు, జర్నలిస్టులకు మధ్య రగడ జరుగుతున్నది.  జర్నలిస్టులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని రగడ చేస్తున్నారు.  


సినిమా రిలీజ్ సమయంలో మీడియా సరిగా సహకరించడం లేదని సమాచారం. దీంతో అక్కడి నిర్మాతలు ప్రత్యేకంగా సాహో కోసం సమావేశం ఏర్పాటు చేసి మీడియాను పిలిపించి మాట్లాడుతున్నారని తెలుస్తోంది.  సహకరించాలని మీడియాను కోరింది.  మీడియా ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.  నిర్మాతలకు.. మీడియాకు మధ్య దూరం పెరగడంతో అక్కడ సహకరించడం అన్నది తగ్గిపోతుంది అన్నది గ్యారెంటీ.  



చెన్నై లో ప్రెస్ మీట్ తరువాత.. మైసూరు, కోచి, ముంబైలో కూడా ప్రెస్ మీట్ లను నిర్వహించబోతున్నారు.  ఈనెల 18 న రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.  ఈ ఈవెంట్ లో సినిమాలో యూజ్ చేసిన కార్లు ఎట్రాక్షన్ గా నిలవబోతున్నాయి.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఈనెల 30 వ తేదీ వరకు ఆగాల్సిందే.  మరి చూద్దాం సినిమా ఎలా ఉంటుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: