టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ మన్మధుడు2. దాదాపు 17 ఏళ్ళ క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించి, అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మన్మధుడు సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో, మన్మధుడు2 పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా, ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా సినిమాలో దర్శకుడు రాహుల్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, దానిని తెరపై ఆకట్టుకునేలా తీయడంలో చాలావరకు విఫలయమయినట్లు సినిమా విశ్లేషకులు చెప్తున్నారు. 

ఇకపోతే నాగార్జున గారి సహా సినిమాలోని నటులందరూ ఆకట్టుకునేలా యాక్ట్ చేసినప్పటికీ, సినిమాలో కొన్ని వల్గర్ సన్నివేశాలు మరియు డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్ ను సినిమాకు చాలావరకు దూరం చేయడం కూడా ఈ సినిమా ఫెయిల్ అవడానికి ఒక కారణమని, అలానే మన్మధుడు లో త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ అద్భుతంగా పేలితే, ఈ సినిమాలో అవి ఏ మాత్రం ప్రేక్షకుడిని రంజింపచేయలేకపోవడం కూడా మరొక కారణమంటున్నారు. సినిమాలో నాగ్ మరియు హీరోయిన్ రకుల్ పెయిర్ ఎంతో బాగుండటం, నాగ్ ను సినిమాలో చూస్తుంటే గీతాంజలి, నిర్ణయం సినిమాల టైం లోని నాగార్జునను గుర్తుకుతెచ్చేలా యంగ్ గా కనపడడం మినహాయించి, సినిమాలో మరేమి లేదనేది మొత్తంగా వారు చెప్తున్న మాట. 

ఇకపోతే గడచిన మొదటి వారంలో ఈ సినిమా కేవలం రూ.9.50 కోట్ల కలెక్షన్ మాత్రమే రాబట్టడం జరిగిందని, అందులోను మరోవైపు నిన్న రిలీజయిన రణరంగం, ఎవరు సినిమాలు సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుండడంతో ఈ సినిమాకు మరింత దెబ్బ పడుతోందట. ఇక ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం, మొత్తం రూ.20.5 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా, క్లోజింగ్ సమయానికి దాదాపుగా రూ.9 కోట్లవరకు బయ్యర్లకు నష్టాలు మిగిల్చే అవకాశం కనపడుతోందంటున్నారు. ఆ విధంగా ఈ మధ్య వచ్చిన నాగార్జున సినిమాల్లో ఇదే అతి పెద్ద డిజాస్టర్ అయ్యే అవకాశం ఉందని వారు చెప్తున్న లెక్కలను బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: