టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ మరొక హీరోగా రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అన్ని సినిమా పరిశ్రమలోనూ విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. ఇకపోతే వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాది మే కల్లా పూర్తి చేసేలా ప్లాన్ చేశారట దర్శకుడు రాజమౌళి. ఇక మిగిలిన రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అలానే విఎఫెక్స్ మరియు గ్రాఫిక్ పనులకు సరిపోతుందని ముందే అన్ని పక్కాగా ప్లాన్ చేశారట. 

ఇకపోతే ఈ సినిమా పూర్తి అయ్యేలోపు చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా మరొక సినిమాలో నటించబోమని ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ ప్రెస్ మీట్ లో తెల్పిన విషయం తెలిసిందే. అయితే మద్యమద్యలో మాత్రం తమ తదుపరి సినిమాల కోసం ఈ ఇద్దరు హీరోలు కొందరు దర్శకుల వద్ద నుండి కథలు మాత్రం వినే పనిలో ఉన్నారట. ఇకపోతే మరోవైపు ఎన్టీఆర్ తదుపరి సినిమా దాదాపుగా త్రివిక్రమ్ తోనే ఫిక్స్ అయినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ సినిమా ప్రారంభానికి మాత్రం చాలానే సమయం పడుతుందట. ఇక ఈ సినిమా స్టోరీని ఎన్టీఆర్ కు వినిపించే సమయంలోనే ఆయన సరసన యంగ్ స్టన్నింగ్ బ్యూటీ రష్మికను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారట త్రివిక్రమ్. 

కాకపోతే ఈ సినిమా కథ పూర్తిగా ఫైనలైజ్ అయిన తరువాతనే హీరోయిన్ వంటి తదితరాల గురించి ఆలోచిద్దామని ఎన్టీఆర్ అనడంతో, హీరోయిన్ విషయం ప్రస్తుతం ప్రక్కన పెట్టారట త్రివిక్రమ్. ఇక ఎన్టీఆర్ తో తాను తీయబోయే తదుపరి సినిమా కోసం  రష్మికను తీసుకోవాలని చూస్తున్నట్లు త్రివిక్రమ్, ఇటీవల తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. వారిలో కొందరు ఈ వార్తను మీడియాకు లీక్ చేసారని అంటున్నారు. అయితే నేడు ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం రష్మిక మరొక స్టార్ హీరో సరసన నటించే సినిమా ఛాన్స్ పట్టేసినట్లే.... !!


మరింత సమాచారం తెలుసుకోండి: