ఏ సినిమా అయినా హిట్ కావాలంటే కథే ప్రాణం.. ఈ విషయాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతా ఒప్పుకుంటారు.. ప్రతి ప్రెస్ మీట్లోనూ అదే చెబుతారు.. మంచి కథలు దొరకడం లేదు.. మంచి రచయతలు లేరు.. ఇలా చెబుతుంటారు సీనియర్లు కూడా.. కానీ రచయితలకు మాత్రం అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు..


తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా హీరోల చుట్టూ, దర్శకుల చుట్టూనే తిరుగుతుంది. ఓ సినిమా హిట్ అయితే.. ఆ క్రెడిట్ అంతా హీరో, డైరెక్టర్ కే వెళ్లిపోతుంది. మహా అయితే టెక్నీషియన్స్ కూ వెళ్తుంది.. అంతే తప్ప రచయితను పెద్దగా పట్టించుకోరు. బాగా పేరున్న పరుచూరి బ్రదర్స్ వంటి వారు తప్ప.. మిగిలినవారకి అంత గుర్తింపు ఉండదు.


కానీ తమిళంలో అలా కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్ తనను హీరోగా మార్చిన రచయితను గుర్తు పెట్టుకుని.. ఓ సభలో బాగా ప్రశంసించారు. ఆయనకు త్వరలో తానే ఇళ్లు ఇస్తానన్నారు. తాను హీరో కావాలనే ఉద్దేశంతో చిత్ర పరిశ్రమలోకి రాలేదని, విలన్‌గా నటించాలన్నదే అప్పటి లక్ష్యమని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆ సభలో చెప్పారు. కానీ ప్రముఖ సినీ కథా రచయిత కలైజ్ఞానం వల్లే తాను హీరోనయ్యానని గుర్తు చేసుకున్నారు.


ఆయన ఇంకా ఏమన్నారంటే..

నాకు హీరోగా నటించాలనే ఆలోచనే లేదు. మొదట్లో విలన్‌గానే నటించా. నన్ను హీరోగా చేసిన గొప్పదనం కలైజ్ఞానంది. ఆయన కథ రాసిన భైరవి సినిమాలో తొలిసారి హీరోగా నటించా.జనం జేజేలు పలికారు. అలా హీరో అయ్యా.. కలైజ్ఞానం అద్దె ఇంట్లో ఉన్నట్లు విన్నా. ఆయనకు ప్రభుత్వం తరఫున ఇల్లు ఇవ్వనున్నట్లు మంత్రి కడంబూర్‌ రాజు చెప్పారు.. నేను ప్రభుత్వానికి ఆ అవకాశాన్ని ఇవ్వదలచుకోలేదు. ఆయనకు నేనే ఓ మంచి ఇల్లు ఇస్తా అని సభాముఖంగా ప్రకటించారు రజినీకాంత్.. మరి ఇలాంటి పరిస్థితి మన తెలుగు చలన చిత్ర సీమలో ఎప్పుడు వస్తుందో..


మరింత సమాచారం తెలుసుకోండి: