ఇటీవల కాలంలో హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాక, పెళ్లి చేసుకొని కొంతకాలం తరువాత తిరిగి సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు.  అలా వచ్చిన చాలామంది సూపర్ హిట్ అవుతున్నారు.  నదియా, రమ్యకృష్ణ, రజిని, భూమిక ఇలా చెప్పుకుంటూ పొతే ఈ లిస్ట్ చాలా ఉన్నది.  ఇప్పుడు ఈ బాటలో మరో హీరోయిన్ కూడా చేరబోతున్నది.  


ఆమె ఎవరో కాదు.. ఒకనాడు తన అందాలతో అందరిని సంబ్రమాశ్చర్యాలతో ముంచెత్తిన హీరోయిన్ నమిత.  తెలుగులో సొంతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.  ఆ తరువాత ఈ హీరోయిన్ వెంకటేష్ తో జెమిని.. కొన్ని తెలుగు సినిమాలు చేసింది.  కానీ, 2010 తరువాత అవకాశాలు తగ్గిపోయాయి.  అటు తమిళంలో కూడా ఆమెకు అవకాశాలు తగ్గాయి.  


2016లో వివాహం చేసుకుకోని సెటిల్ అయ్యింది.  విచిత్రం ఏమిటంటే.. ఈ అమ్మడు ఇప్పుడు మరలా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నది.  దానికి తగ్గట్టుగా బాడీ షేప్ ను మార్పులు చేసుకుంది. స్లిమ్ గా మారిపోయింది.  ఎప్పుడు లేని విధంగా స్లిమ్ గా మారి అందరికి షాక్ ఇస్తోంది.  నమిత అంటే అందరికి కనిపించే రూపం బొద్దుగా ఉండటం.. బరువైన అందాలతో అందంగా కనిపించడం.  


ఇలా కాకుండా, ఈ అమ్మడు ఇప్పుడు ఇలా స్లిమ్ గా మారడంతో అభిమానులు ఒకింత బాధపడుతున్నా.. తిరిగి రీ ఎంట్రీ ఇస్తోంది కాబట్టి తప్పకుండా మరలా సినిమా ఇండస్ట్రీలో తన హవాను కొనసాగించినట్టు అవుతుంది.  అందుకే ఈ అమ్మడు వీలైనంత త్వరగా ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్నారు.  వచ్చిన తరువాత వీలైనన్ని సినిమాలు చేయాలని అభిమానులు ఆశ పడుతున్నారు.  ఒక్క అభిమానులే కాదు.. సినిమా ఇండస్ట్రీలోని చాలామంది నమిత రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అనుకుంటున్నారు.  మరి చూద్దాం నమిత ఏం చేస్తుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: