ఒక్కసారి ప్రజలు ఆరాధించడం మొదలు పెట్టారు అంటే.. వారిని నెత్తిన పెట్టుకుంటారు.  వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు.  ముందు వాళ్ళను మెప్పించాలి.  ఆ తరువాత వాళ్ళే వారికి అండగా ఉంటారు.  అభిమానులు ఎక్కువగా ఉండే వాళ్లలో సినిమా వాళ్ళు ఉంటారు.  సినిమా ఇండస్ట్రీలో అభిమానులు ఉండటం సహజమే.  అది ఇప్పటి నుంచి వస్తున్నది కాదు.  ఎన్నో ఏళ్లుగా వస్తున్నదే.  


కన్నాంబ కాలం నుంచి నేటి సమంత, కీర్తి సురేష్ కాలం వరకు ఇలా జరుగుతూనే ఉన్నది.  బిరుదులూ, అవార్డులు తరువాత సంగతి మొదట అభిమానులు ముఖ్యం.  అభిమానులు అభిమానిస్తే.. చాలు అంతకంటే కావాల్సిన బిరుదులూ ఏముంటాయి చెప్పండి.  ఇదిలా ఉంటె, గతంలో సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వం అనేక బిరుదులూ ప్రధానం చేసేది.  ఇప్పట్లో పద్మశ్రీ బిరుదులు ఎలా ఇస్తున్నారో అలా అన్నమాట.  


సినిమా ఇండస్ట్రీలో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటీనటుల అవార్డులను ఇప్పటికి ప్రధానం చేస్తోంది.  కాకపోతే, ఇప్పుడు ఇచ్చే అవార్డులు వేరు.  అప్పట్లో ఈ అవార్డులకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి.  ఉత్తమ నాటికి ఊర్వశి అని, ఉత్తమ నటుడికి భరత్ అని పేర్లు ఉండేవి.  ఆ తరువాత వాటిని పక్కన పెట్టారు.  కేవలం ఉత్తమ నటి, నటుడు అని మాత్రమే ఇస్తున్నారు. శారదా కు ఊర్వశి అనే బిరుదు అలానే వచ్చింది.  


శారదకు బిరుదు వచ్చింది కానీ, భానుమతికి అలాంటి బిరుదు రాలేదు.  దీనిపై ఓ వ్యక్తి అప్పట్లో భానుమతిని అడిగారట.  దీనికి ఆమె ఘాటైన సమాధానం ఇచ్చింది.  ప్రజలు మెచ్చుకుంటే చాలు.. ప్రభుత్వాలు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రజలు మెచ్చుకొని ఊర్వశి బిరుదు ఇవ్వాలని అనుకుంటే తన వర విక్రయం సినిమాతోనే తాను ఊర్వశిని అయ్యానని చెప్పింది.  ప్రజలు తన సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.  అంతలా వారిని తన నటనతో ఆకట్టుకున్నాను అని చెప్పింది.  భానుమతి అంటే అది మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: