హీరోనే రైట‌ర్‌గా ఉంటూ తెలుగులో స‌క్సెస్‌లు సాధించినవారు చాలా అరుదు. అలాంటి కోవ‌కు చెందిన హీరోనే అడ‌విశేష్‌. పంజా, క్షణం, గూఢచారి లాంటి విభిన్న కథా చిత్రాలతో నటుడిగానే కాదు స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు శేష్. ప్రస్తుతం  హీరో అడివి శేష్, రెజీనా క‌సండ్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలో న‌టించిన చిత్రం ‘ఎవరు’. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌ పై  వెంకట్ రాంజీ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ  పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆగష్టు 15 న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లై ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందింది.  ఈ సంద‌ర్భంగా అడ‌విశేష్ మీడియాతో ముచ్చ‌టించారు...
  
 నన్ను చూడగానే అందరూ  మాది చాలా రిచ్ ఫ్యామిలీ అనుకుంటారు కానీ  యుఎస్, కాలిఫోర్నియాలో మాది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలా కష్టపడి చదువుకొని పైకొచ్చాను. అలా సినిమా మీద ఇంట్రెస్ట్ తో  నా దగ్గర ఉన్న అన్ని డబ్బులు ‘కిస్’ సినిమాకే పెట్టేసాను. ఆ సినిమాకు సంబంధించి పోస్టర్లకు వాడే మైదా పిండి ఖర్చు కూడా రాలేదు. అది నాకొక కాస్ట్లీ లెసన్. సో దర్శకుడిగా నేను సక్సెస్ కాలేదు. అందుకే ప్రస్తుతం అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నటుడిగా  చేస్తూ స్క్రీన్ ప్లే రైటర్ వ్యవహరిస్తున్నాను. 


ఆ చిత్రం విడుద‌లైన సంద‌ర్భంలో చాలా ఇబ్బందుల‌కు గుర‌య్యాను ఒక‌ర‌కంగా చెప్పాలంటే నాకు అద్దెక‌ట్ట‌డానికి కూడా డ‌బ్బులు లేవు. అలాగ‌ని ఇంట్లో వాళ్ళ‌ని అడ‌గ‌లేను అలా కిస్ చిత్రం వ‌ల్ల చాలా ఇబ్బందులు ప‌డ్డాను. ఇండస్ట్రీ నుండి నేర్చుకున్నాది ఏమిటంటే.. ‘క్షణం’ సినిమాను ముందుగా కొందరికీ చూపిస్తే అస్సలు బాలేదు కష్టం అని అన్నారు. నాకు డైరెక్టర్ కి అలాగే ముఖ్యంగా ప్రొడ్యుసర్ కి అందరం షాకయ్యాం. తీరా చూస్తే  అది సూపర్ హిట్టైంది. ఎప్పుడూ ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేయని బన్నీ ఆ సినిమాకు ట్వీట్ చేసాడు.  అలాగే ప్రభాస్ గారు ఫేస్ బుక్ లో గూఢచారి ట్రైలర్ పోస్ట్ చేశారు. అలాగే మహేష్ బాబు గారు సినిమా గురించి ట్వీట్ చేశారు, నాగార్జున గారు అయితే ఆయన ఓన్ ప్రొడక్షన్ చి||ల||సౌ రిలీజ్ లో ఉండగా నా సినిమా గురించి మాట్లాడారు. రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్ గూఢచారి సక్సెస్ మీట్ కి వచ్చి మరి నన్ను కంగ్రాచ్యూలేట్ చేసి వెళ్లారు. మనం మంచి చేస్తే ఇండస్ట్రీ కూడా మంచి చేస్తుందని నిరూపించింది. అలాగే సినిమా ఎవరికి చూపించాలి అనేది కూడా తెలిసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: