స్టార్ సినిమాకు సంబందించిన విషయాల పట్ల ఎలాంటి లీకులు జరుగకూడదని చిత్రయూనిట్ జాగ్రత్త పడుతుంది. చేస్తున్న సినిమా గురించి ముందే సబ్జెక్ట్ కాని.. షూటింగ్ స్పాట్ నుండి పిక్స్ కాని లీక్ అయితే అంత కిక్ ఉండదు. అందుకే షూటింగ్ టైంలో డైరక్టర్ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని సినిమాలు టైటిల్ విషయంలో కూడా జాగ్రత్త పడుతుంటారు.


లేటెస్ట్ గా కార్తి హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు టైటిల్ లీక్ అయ్యింది. ఇంతకీ ఈ టైటిల్ లీక్ చేసింది ఎవరో తెలుసా.. స్వయానా ఆ సినిమా హీరోయిన్ రష్మికనే. కోలీవుడ్ లో రోమియో ఫేమ్ భాగ్యరాజ కన్నన్ డైరక్షన్ లో కార్తి హీరోగా క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉంది. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ గురించి కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.


సినిమా టైటిల్ పై కొనసాగుతున్న డిస్కషన్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పై సూపర్ బజ్ ఏర్పడింది. కాని రష్మిక మాత్రం సుల్తాన్ లో ఇది నాల్గవ రోజు.. 'యు డోంట్ గెట్ టు సీ ది లుక్ యో' అంటూ కామెంట్ పెట్టింది. ఆన్ లొకేషన్ నుండి పెట్టింది కాబట్టి దాదాపు ఈ సినిమాకు టైటిల్ ఇదే అని ఫిక్స్ అవ్వొచ్చు. రష్మిక టైటిల్ లీక్ చేయడంపై చిత్రయూనిట్ ఆమెపై కోపంగా ఉన్నారట.


తెలుగులో ఛలో, గీతా గోవిందం రెండు సినిమాలతో హిట్లు అందుకున్న రష్మిక రీసెంట్ గా వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాతో నిరాశ పరచింది. ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న రష్మిక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: