జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటులు అతి కొద్ది మందే ఉన్నారు.  అలాంటి స్టార్ హీరోల్లో ఒకరు రజినీకాంత్.  తెలుగు, తమిళ, కన్నడ,మళియాళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో సెటిట్ అయ్యారు.  తమిళ తంబీలకు ఆరాద్య దైవంగా మారిన ఆయన కెరీర్ లో ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ స్థాయికి వచ్చారు.  వాస్తవానికి రజినీకాంత్ మద్రాసీ కాదు..జన్మతః మరాఠీ యాదవ కులంలో జన్మించాడు.  ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్.

మొదట ఆయన బస్ కండెక్టర్ గా జీవితాన్ని ఆరంభించారు..అనూహ్యంగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అయితే అప్పటి వరకు ఏ హీరో ప్రదర్శించని ట్రిక్స్, స్టైల్ రజినీకాంత్ చూపించడంతో ఆయన అతి తక్కువకాలంలోనే పాపులర్ హీరోగా మారారు.  మొదట్లో రజినీ కాంత్ కొన్ని విలన్ పాత్రల్లో నటించారు. తాజాగా సీనియర్ కథారచయిత, నిర్మాత కలైజ్ఞానంకు సీనియర్ దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో సన్మానసభ జరిగింది. చెన్నైలో జరిగిన ఈ సభకు సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హీరో అవుదామనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రాలేదని.. విలన్ గా నటించడమే అప్పటి తన లక్ష్యమని సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పారు.  భారతీ రాజకు నాకు మద్య చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని..కొన్ని సార్లు మా మద్య భేదాభిప్రాయాలు కూడా వచ్చాయని అన్నారు.  భారతీరాజ నన్నెపుడూ  'తలైవరే' అనే పిలుస్తారని అన్నారు.

డబ్బు, పేరు ప్రఖ్యాతలను ఎప్పుడైనా సంపాదించుకోవచ్ఛు కానీ పాత స్నేహితులను సంపాదించుకోవడం చాలా కష్టమని భారతీరాజాని ఉద్దేశిస్తూ అన్నారు.వాస్తవానికి నేను సినీ పరిశ్రమకు వచ్చింది విలన్ గా నటించాలని..తనను హీరోగా చేసిన ప్రత్యేకత కలైజ్ఞానంకు దక్కుతుందని చెప్పారు.కలైజ్ఞానం అద్దె ఇంట్లో ఉన్నట్లు తాను విన్నానని..ఆయన నివసించడానికి తనే మంచి ఇంటిని ఏర్పాటు చేస్తానని రజినీకాంత్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: