మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే ఇప్పటిదాకా చేయని రీతిలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది సైరా సినిమా. ఈ సినిమాలో స్వాతంత్ర పోరాట యోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చేశారు చిరంజీవి. ఈ పాత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో చిరంజీవి అద్భుతంగా నటించినట్లు చిత్ర యూనిట్ చెప్పుకోచ్చింది.


అంతేకాకుండా యాక్షన్ సన్నివేశాల్లో ఉన్న చాలా సందర్భాలలో సినిమాల్లో తన వయసుతో నిమిత్తం లేకుండా చాలా ఎనర్జిటిక్ గా చిరంజీవి ప్రతి ఫ్రేములో కనిపించినట్లు సినిమా యూనిట్ ఇటీవల చెప్పుకొచ్చింది. మరియు అదే విధంగా తాజాగా చిరంజీవి కూడా సైరా సినిమాలో చేసిన ప్రతి సీన్ చాలా క్రమశిక్షణతో ఇష్టంగా చేసినట్లు...యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ సన్నివేశాన్ని ఆస్వాదిస్తూ నటించినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ సన్నివేశాలలో గుర్రపు స్వారీ చేస్తూ యాక్షన్ సీన్స్ రియలిస్టిక్ గా చేసినట్లు చిరంజీవి చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.


సినిమాలో ప్రతీ యాక్షన్ సన్నివేశాల్లో చేసిన హార్స్ రైడింగ్ సొంతంగా చేసినవే అంటూ.. డూప్ లేకుండా నటించినట్లు చెప్పారు. దీంతో ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఈ వయసులో కూడా మెగాస్టార్ హార్స్ రైడింగ్ అదరగొట్టారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ సెల్యూట్ చేస్తున్నారు. మరి సిల్వర్ స్క్రీన్ పై ఆ యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటుందో చూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా...అక్టోబర్ రెండవ తారీకున విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. ఈక్రమంలో సినిమా నిర్మాత రామ్ చరణ్ ప్రమోషన్ కార్యక్రమాలు చాలా వినూత్నంగా ఎవ్వరూ చేయని విధంగా చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: