బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తర్వాత ఆ రేంజ్ స్మార్ట్ హీరో, కండల వీరుడుగా పేరు తెచ్చుకున్నాడు హృతిక్ రోషన్.  స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన హృతిక్ రోషన్ 2000 సంవత్సరంలో మొదటి సినిమా ‘కహోనా ప్యార్ హై’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో 1980వ దశకంలో కొన్ని సినిమాల్లో బాలనటునిగా నటించాడు హృతిక్.  ఆ తర్వాత కహోనా ప్యార్ హై సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారాలు అందుకున్నారు ఆయన.

ఆ తరువాత ఫిజా (2000), మిషన్ కాశ్మీర్ (2000) వంటి సినిమాల్లో నటించిన ఆయన కభీ ఖుషీ కభీ గమ్ (2001) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.  ఆ తర్వాత ఒకటీ రెండు సినిమాల్లో నటించినా పెద్దగా హిట్ కాలేదు.  ఆ తర్వాత సైన్స్ ఫిక్షన్ కోయీ.. మిల్ గయా (2003) సినిమాతో తిరిగి విజయాన్ని పొందారు. ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని కూడా అందుకున్నారు. క్రిష్ (2006) సినిమా ఈ చిత్రానికి సీక్వెల్ గా నిర్మించినదే.

ఆయన కెరీర్ లోని మూడవ ఫిలింఫేర్ పురస్కారం ధూమ్2 (2006) సినిమాతో అందుకున్నారు ఆయన. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం గెలుచుకున్నారు. హృతిక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లు కూడా ఇచ్చారు. చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా,  హృతిక్ రోషన్ స్టైల్, యాక్టింగ్, ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టైలీష్ హీరోగా, అతని వేసే స్టెప్పులకు చాలా మంది ఫిదా అవుతారు. ఇక, తాజాగా, కొత్త రికార్డు సృష్టించాడు మన బాలీవుడ్ హీరో. ఈ ఏడాదికి గానూ తాజాగా విడుదల చేసిన టాప్ 5 మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ జాబితాలో హృతిక్‌ టాప్ స్పాట్‌కు దూసుకెళ్లాడు.

క్రిస్ ఎవాన్స్, డేవిడ్ బెక్హాం, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ హృతిక్ 'ది మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ ఇన్ ది వరల్డ్' జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు. 'సూపర్ 30' మూవీ సూపర్ హిట్ తర్వాత 'ది మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ ఇన్ ది వరల్డ్'గా నిలవడం అటు హృతిక్ రోషన్‌తో పాటు ఆయన ఫ్యాన్స్‌ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: