మతపరమైన సందర్భాలు చాలా సందర్భాల్లో వివాదం సృష్టిస్తాయి. మాధవన్ విషయంలోనూ ఇదే జరిగింది. ఇలా ఆలోచించిన ఓ అభిమానికి గట్టిగా క్లాస్ పీకాడు మాధవన్. ఆయన ఇచ్చిన వివరణకు నెటిజన్లు అండగా నిలిచారు. మాధవన్ కథ ఎంపిలోనే కాదు.. మతానికి సంబంధించిన విషయంలోనూ కొత్తగా.. సమానంగా ఆలోచించాడు. ఇలా ఆలోచించమడమే ఓ అభిమాని ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. రాఖీ పండుగ సందర్భంగా తండ్రీ కొడుకులతో దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు మాధవ్. ఈ ఫోటను బూతద్దంలో చూసిన ఓ అభిమానికి అందులో శిలువ కనిపించడం నచ్చలేదు. 

మాధవన్ పూజ గదిలో శిలువ ఎందుకు ఉందంటూ.. జిక్సా అనే మహిళ తప్పుపట్టింది. మతం పరువు తీశారు.. మీ మీద ఉన్న గౌరవం పోయింది. మీరు హిందూ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారన్నది అబద్దమంటూ ఫైర్ అయింది జిక్సా. దీనికి మాధవన్ ఘాటైన సమాధానం ఇచ్చాడు. 

జిక్సా కామెంట్స్ కు మాధవన్ తీవ్రంగా స్పందించాడు. నాకు అన్ని మతాలు సమానమే.. హిందూ.. ముస్లిం.. సిక్కు.. క్రిస్టియన్ అనే కాదు.. ప్రతీ మతానికి మా ఇంట్లో ప్రవేశం ఉంది. మీకు కనిపించడం లేదనుకుంటా.. ఆ ఫోటోలో గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది. ఎఁదుకంటే.. మీకున్న మతం జబ్బు తనకు లేదంటూ రిప్లై ఇచ్చాడు మాధవన్. మాధవన్ ఇచ్చిన సమాధానికి ఇద్దరు అభిమానులు షాక్ కు గురయ్యారు. తమ హీరో సర్వమతాలను అభిమానిస్తారంటూ తెలుసుకొని ఆశ్చర్యపోయారు. మొత్తానికి హీరో మాధవన్ ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్ నే కాదు.. సామాన్య ప్రజానీకానికి మంచి మార్గాన్ని చూపింది. అందరూ సమానమే.. అందరూ పూజించే దేవుళ్లూ సమానమే అనే సందేశాన్ని ఇచ్చాడు. కొలిచే ఆరాధ్య దైవాన్ని బట్టి మనుషులను కించపరచకూడదంటూ ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ అందరినీ ఆలోచింపజేసింది.   





మరింత సమాచారం తెలుసుకోండి: