టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సహజనటిగా తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి జయసుధ గారు. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన పండంటి కాపురం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జయసుధ గారు, ఆ తరువాత ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు సహా అప్పటి అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించారు. అంతేకాదు ఆమె అప్పట్లో చంద్ర మోహన్, మురళీమోహన్, మోహన్ బాబు వంటి వారితో కూడా నటించి మంచి పేరు సంపాదించారు. కె. రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో ఆమె నటించిన జ్యోతి నటిగా ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇక ఆ తరువాత ఆమెకు సినిమా అవకాశాలు మెల్లగా పెరగడం మొదలయ్యాయి. ఆ తరువాత ఆమె కె బాలచందర్ గారి దర్శకత్వంలోని ఇది కథ కాదు సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకువచ్చింది.

అయితే మధ్యలో ఆమె నటించిన సినిమాలు కొన్ని పరాజయం పాలయినప్పటికీ, జయసుధ వాటిని లక్ష్య పెట్టకుండా ముందుకు సాగారు. ఆమె ఇది కథ కాదు, అమరదీపం, శక్తి, త్రిశూలం, అడవి రాముడు, ఇది కథ కాదు, గోపాల్ రావు గారి అమ్మాయి, గోపాల కృష్ణుడు, గృహప్రవేశం, పోరాటం, రాముడు కాదు కృష్ణుడు, బొబ్బిలి బ్రాహ్మన్న, తాండ్రపాపారాయుడు, కలికాలం వంటి సూపర్ హిట్ సినిమాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇకపోతే ఇటీవల ఆమె  అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పరుగు, కొత్త బంగారు లోకం, శతమానంభవతి, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఎవడు, ఊపిరి, మహర్షి వంటి తోపాటు మరెన్నో సూపర్ హిట్స్ లో నటించి ఇప్పటికీ తన సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అలానే ఆమె తమిళ్, హిందీ, మరియు కొన్ని కన్నడ హిట్ సినిమాల్లో కూడా నటించి ఆయా ఇండస్ట్రీల ప్రేక్షకుల నుండి కూడా మంచి పేరు సంపాదించడం జరిగింది. ఇకపోతే జయసుధ, గారి అసలు పేరు నిడదవోలు సుజాత. 

తన కాలేజీ చదువులు అనంతరం హీరో కృష్ణ గారి భార్య అయిన విజయనిర్మల గారి ప్రోద్బలంతో జయసుధ గారు సినిమాల్లోకి ప్రవేశించడం జరిగింది. జయసుధ 1985లో ప్రముఖ హిందీ సినిమా నిర్మాత నితిన్ కపూర్ ని వివాహమాడారు. వారిని నీహార్, శ్రేయాన్ అనే ఇద్దరు కుమారులు. అయితే ఇటీవల అనారోగ్య కారణంగా నితిన్ కపూర్ మరణించడంతో జయసుధ మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు జయసుధ 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఎమ్యెల్యే గా ఎన్నిక అవ్వడం జరిగింది. అయితే 2014లో కూడా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ఇక అప్పటినుండి రాజకీయాల్లో ఆమె కొంత యాక్టివ్ గా ఉండడం మానేశారు. ఇకపోతే జయసుధ గారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి నాలుగు సార్లు ఉత్తమంగా నటిగా నంది అవార్డు రాగా, మూడు సార్లు ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డులు కూడా లభించడం జరిగింది. ఇప్పటివరకు పలు భాషల్లో నటించిన జయసుధ గారు ఇప్పటివరకు మొత్తం 300 పైచిలుకు సినిమాల్లో నటించడం జరిగింది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: