టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తొలితరం సూపర్ స్టార్ శ్రీ నటరత్న ఎన్టీఆర్ గారి తరువాత ఇంచుమించు అంతటి పేరు సంపాదించిన హీరో ఎవరంటే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారే. నిజానికి ఎన్టీఆర్ గారి తరువాత  సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఆయనంతటి పేరు సంపాదించినప్పటికీ, కొన్ని కారణాల వలన కృష్ణ గారికి అంతగా గుర్తింపు లభించలేదు అనే అంటుంటారు సినిమా విశ్లేషకులు. ఆ తరువాత తరంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కెరీర్ ప్రారంభించిన చిరంజీవి, ఎంతో కష్టపడి స్వశక్తితో టాలీవుడ్ కి సుప్రీమ్ హీరోగా, ఆ తరువాత మెగాస్టార్ గా ఎదిగి ఎనలేని కీర్తిని గడించారు. అయితే 2008 తరువాత మెగాస్టార్ రాజకీయాల బాట పట్టడంతో ఆయన తరువాత పక్కాగా ఎవరు నెంబర్ వన్ అనే విషయమై టాలీవుడ్ లో ఇప్పటికీ కూడా చర్చ నడుస్తూనే ఉంది. అయితే చిరంజీవి గారి తరువాత ఆ రేంజ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, కలెక్షన్స్ సాధించగల స్టామినాని సంపాదించిన హీరోల్లో అందరికంటే ముందువరుసలో నిలిచేది మాత్రం సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. 

ఇక టాలీవుడ్ లో వీరిద్దరి సినిమాలు రిలీజ్ అయితే చాలు, వారి వారి అభిమానులు చేసే  హడావుడి, వచ్చే ఓపెనింగ్స్ అత్యద్భుతం అనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇద్దరూ కూడా అన్ని విధాలుగా సమఉజ్జిలే అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మహేష్ సినిమాలు ఒకింత ముందు ఉంటె, మరికొన్ని ప్రాంతాల్లో పవన్ సినిమాలు ముందు ఉండడం జరుగుతూ వస్తోంది. ఇక టాలీవుడ్ కి సంబంధించి ఎవరు మాట్లాడినా ముందుగా ఈ ఇద్దరి పేర్లు ఎక్కువగా స్మరిస్తూ ఉండడం తరచూ చూస్తూనే ఉంటాం. ఇక నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తన లైఫ్ స్టైల్ మరియు సినిమా కెరీర్ గురించిన విషయాలను బిపాజిటివ్ అనే జాతీయ పత్రికతో పంచుకున్నారు. అయన కోడలు ఉపాసన గారు వ్యాఖ్యాతగా మెగాస్టార్ ని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో ఇప్పటికే యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాధిస్తోంది. ఇక ఈ ఇంటర్వ్యూ లో భాగంగా మెగాస్టార్ మాట్లాడుతూ, 

నిజానికి తనకు రాజకీయ పార్టీ నెలకొల్పి ఆ రంగంవైపు వెళ్లినప్పటికీ, తనకు జీవితాన్నిచ్చిన సినిమా రంగం మాత్రం ఎప్పుడూ గుర్తుకు వస్తూనే ఉండేదని, అయితే తాను గతంలో చివరిగా నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా రిలీజ్ అయి దాదాపుగా పదేళ్లు అయిందని, ఇక ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమాకు మేకప్ వేసుకున్నప్పుడు తనకు ఈ మధ్యలోని పదేళ్లు ఒకసారి గుర్తుకు వచ్చినపుడు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి వారు, మన తెలుగు సినిమాను ఎంత బాగా ముందుకు తీసుకెళ్లారు అనే విషయాలు జ్ఞప్తికి రావడం ఆనందంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే మెగాస్టార్, పవన్, చరణ్ లతో పాటు మహేష్ బాబు గొప్పతనం గురించి కూడా చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ మెగాస్టార్ ను ఆకాశానికి ఎత్తేస్తూ సోషల్ మీడియా వేదికల్లో ఆయనను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: