తెలుగులో ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో ఛాన్సులు అందుకుంది. తెలుగులో తనకు తగిన గుర్తింపు రావట్లేదని గుర్తించిన తాప్సీ తన మఖాం ను బాలీవుడ్ కు మార్చేసింది. అక్కడ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ సినిమా సినిమాకు క్రేజ్ తెచ్చుకుంటుంది తాప్సీ.   


ఇప్పటికే అక్కడ సూపర్ హిట్ సినిమాలు చేసిన తాప్సీ లేటెస్ట్ గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన మిషన్ మంగళ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలక్షన్స్ తో దూసుకెళ్తున్న మిషన్ మంగళ్ సక్సెస్ గురించి ఓ ఇంగ్లీష్ మేగజైన్ తో ముఖాముఖి జరిపారు తాప్సీ. చిట్ చాట్ లో భాగంగా ఫెమినిజం మీద తన స్పందన తెలిపారు. తన దృష్టిలో ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్. అనుష్క శర్మలు బాలీవుడ్ ఐకాన్స్ అని చెప్పారు తాప్సీ.


ఇక ఫెమినిజానికి సరైన అర్ధం పురుషులతో సమానంగా అవకాశాలు అందుకోవడమే అని.. మన నైపుణ్యాన్ని అందరికి తెలిసేలా చేయాలంటే ముందు అవకాశాలు రావడం ముఖ్యమని అన్నారు తాప్సీ. ఈమధ్య కంగనా సోదరి రంగోలి తాప్సీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగాను తాప్సీ కాపీ కొడుతుందని రంగోలి అన్నారు. 


అయితే దీనిపై స్పదించిన తాప్సీ కంగనకు రింగు రింగుల జుట్టు ఉందని.. కాని తను అలా పుట్టలేదని.. ఇక నేను తనని ఏం కాపీ కొట్టానో నాకు తెలియదని.. అయినా ఓ మంచి నటిని కాపీ కొడితే తప్పేం కాదని ఇక మీదట కూడా తాను ఇలానే ఉంటానని చెప్పుకొచ్చింది తాప్సీ. తనని చీప్ అని అన్నారు.. అవును నిజమే తాను భారీ పారితోషికం తీసుకోఉ కాబట్టే రంగోలి తనని చీప్ నటి అని ఉంటుందని తాప్సీ గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: