మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా చాలా కష్టపడుతున్నారు.  సినిమా షూటింగ్ పూర్తయింది.  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  మేకింగ్ వీడియోను ఇప్పటికే రిలీజ్ చేశారు.  ఆ వీడియో సూపర్ హిట్ అయ్యింది.  సినిమా కోసం చాలా కష్టపడ్డారు.  ఈ వీడియోలో దాదాపు అందరి పాత్రలను రివీల్ చేశారుగాని, అనుష్క పాత్రను మాత్రం రిలీల్ చేయలేదు.  అనుష్క ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నారు.  


ఆమె రోల్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.  పైగా అనుష్క పాత్రతోనే సినిమా స్టార్ట్ అవుతుంది.  ఆమె డైలాగ్స్ సినిమాకు, సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి స్ఫూర్తిగా నిలుస్తాయని అంటున్నారు.  ఇంతకీ ఇందులో అనుష్క చేస్తున్న రోల్ ఏంటి అంటే.. ఇందులో ఆమె ఝాన్సీ లక్ష్మి భాయి రోల్ ను చేస్తోంది.  ఆమె స్ఫూర్తితోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో తెల్లదొరలపై పోరాటం షురూ చేస్తాడు. 

అయన తెల్లదొరలపై ఎలాంటి పోరాటం చేశారు.. ఎలా తెల్లదొరలను ఎదుర్కొన్నారు.  ఎలా తెల్ల దొరలకు దొరికాడు అన్నది సినిమాలో చూడాల్సిందే.  అయితే, తెల్లదొరలు దొరికిన తరువాత ఉయ్యాలవాడకు మరణశిక్ష విదిస్తుంది.  అంటే కథ విషాదంగా ముగుస్తుంది.  విషాదంగా ముగిసినా.. వీరోచితంగా ముగుస్తుంది కాబట్టి చిరు అభిమానులు స్వాగతిస్తారనే అనుకోవాలి.  ఇది యదార్ధ కథ.  కాబట్టి మార్చడానికి వీలులేదు.  


సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయని సమాచారం.  ఈనెల 20 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కాబోతున్నది.  టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఉండబోతున్నది.  పవన్ వాయిస్ కేవలం టీజర్ లో మాత్రమే కాకుండా, సినిమా మొత్తం ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.  సినిమాలో పవన్ వాయిస్ ఉంటె అది సినిమాకు ప్లస్ అవుతుంది.  


పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా తదితరులు నటిస్తున్నారు.  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: