టాలీవుడ్ టాల్ హీరో ప్రభాస్ బాహుబలి తరువాత కొత్త సినిమాను జనం ముందుకు తీసుకువస్తున్నాడు. సాహో ఈ నెల 30న విడుదల అవుతోంది. ఈ మూవీ కోసం ప్రభాస్ ఏకంగా రెండేళ్ల పైగా సమయం తీసుకున్నాడు. బాహుబలి మూవీతో ఇంటర్నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ప్రభాస్ దాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే సాహో. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.


అయితే ఈ మూవీని పూర్తిగా హాలీవుడ్ రేంజిలో రూపొందించాలన్న థాట్ తో ఏకంగా యాక్షన్ సీన్లతోనే మొత్తం నింపేశాని టాక్. అంటే ఎక్కడికక్కడ చేజింగ్స్, ఫైటింగులు ఉంటాయన్న మాట. మూవీ మొదలైన దగ్గర నుంచి ఇదే స్టోరీ తప్ప పెద్దగా కధకు ఇంపార్టంట్స్  ఇవ్వలేదని ఇన్నర్ టాక్. హాలీవుడ్ మూవీస్ అలాగే ఉంటాయి.


అయితే హాలీవుడ్ మూవీస్ గురించి తెలిసి అవి కోరి వెళ్ళి చూస్తారు కాబట్టి కధ గురించి ఎవరూ పట్టించుకోరు. కానీ ఇక్కడ హీరో ప్రభాస్. ఆయన టాలీవుడ్ హీరో. అందువల్ల కధ చాలా అవసరం. మరి ప్రభాస్ సాహో ఇంటర్నేషనల్ మార్కెట్ ని ద్రుష్టిలో పెట్టుకుని తీస్తే మాత్రం లోకల్ గా ఉన్న ఆడియన్స్ ఎలా రిసీవ్ చేస్తుంటారన్నది పెద్ద ప్రశ్న


ప్రభాస్ సైతం ఈ మూవీ మీద చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. బాహుబలి  సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఆ క్రెడిట్ అంతా రాజమౌళీకే పోయింది.  ప్రభాస్ లోని అసలైన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే సాహో హిట్ చాలా ముఖ్యం. అందువల్ల బాగా వత్తిడికి లోనై సాహో తీశారనే చెప్పాలి. 


నిజానికి లోకల్ ఆడియన్స్, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని ఒకే గాటకు కట్టడం అంటే చాలా కష్టం. ఎవరి టేస్టులు వారివి. సాహోలో మాత్రం హాలీవుడ్ టేస్ట్ తో తీసేశారు. దాంతో లోకల్ గా ఆడియన్స్ రిసీవింగ్ ఎలా ఉంటుందన్నది టెన్షన్ గానే ఉందట. మరి సాహో ఇంటా బయటా కలెక్షన్లు కుమ్మితేనే 350 కోట్ల ప్రీ బిజినెస్ సొమ్ము వెనక్కు వచ్చేది.



మరింత సమాచారం తెలుసుకోండి: