‘సాహో’ రిజల్ట్ గురించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఆతృతగా ఎదురు చూస్తున్న నేపధ్యంలో ‘సాహో’ వార్తలతో పాటు ప్రభాస్ అనుష్కల సానిహిత్యం గురించి వార్తల హడావిడితో బాలీవుడ్ మీడియా హోరెత్తి పోతోంది. అనేక సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరూ పెళ్ళి చేసుకుంటారా లేదా అంటూ బాలీవుడ్ మీడియా ప్రచురిస్తున్న కధనాలు షాకింగ్ గా మారుతున్నాయి. 

అనుష్క ప్రభాస్ పెళ్లి విషయమై  ప్రభాస్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదనీ దీనికిగల కారణం అనుష్క కుటుంబ నేపధ్యం అంటూ ఆ కధనంలో వార్తలు రాస్తున్నారు. అంతేకాదు ప్రభాస్ కుటుబ సభ్యులు అంతా  సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులలో కన్నడ ప్రాంతానికి చెంది వేరే సామాజిక వర్గానికి చెందిన అనుష్కతో పెళ్లి కుదరు అని ప్రభాస్ కుటుంబ సభ్యులు స్పష్టంగా ప్రభాస్ కు స్పష్టంగా చెప్పేసారు అంటూ ఆ ఆ కధనంలో పేర్కొన పడింది.

దీనితో తన కుటుబ సభ్యుల అభిప్రాయాన్ని వ్యతిరేకించే ఉద్దేశంలేని ప్రభాస్ ఈవిషయాలను అనుష్కకు సున్నితంగా చెప్పాడు అంటూ ఆ కథనంలో పేర్కొన పడింది. అంతేకాదు ప్రభాస్ తన కుటుంబ సభ్యుల  సూచనను తిరస్కరించలేని పరిస్థితిలో ఆ షాక్ లో కొన్ని సంవత్సరాలు పెళ్ళి చేసుకోక పోవచ్చు అంటూ ఆకతనంలో పెర్కొనపడినట్లు తెలుస్తోంది. 

దీనితో ప్రభాస్ ముందు ఈ విషయమై కేవలం రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయని అందులో ఒకటి తన కుటుం బసభ్యులను ఎదిరించి అనుష్కను పెళ్ళి చేసుకోవడం లేకుంటే శాస్వితంగా పెళ్ళికి దూరంగా ఉండటం అంటూ బాలీవుడ్ మీడియా ప్రచురిస్తున్న కథనాలు అత్యంత ఆశ్చర్యంగా మారాయి. ఒకవైపు ప్రభాస్ తాను అనుష్కను కలిసి రెండు సంవత్సరాలు అయింది అని చెపుతున్నా ఆ విషయాలను పట్టించుకోకుండా ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న వార్తలను చూస్తుంటే ప్రభాస్ పట్ల బాలీవుడ్ మీడియా ఎంత ద్వేషంతో ఉందో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: