సింగింగ్ లో కొడుకు తండ్రిని మించిపోయాడు. పితామగన్ తో విక్రమ్ జాతీయ ఉత్తమనటుడు అనిపించుకున్నాడు. కొడుకు ధృవ్ ఇపుడే యాక్టింగ్ స్టార్ చేశాడో లేదో కానీ ఓ పాట పాడేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు. ప్రొఫెషనల్ సింగర్ లా ధృవ్ పాడిన పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.  

ధృవ్ అర్జున్ రెడ్డి రీమెక్ "ఆదిత్య వర్మ"తో హీరోగా పరిచయమవుతున్నాడు. అమెరికా, లండన్ లో నేర్చుకున్న యాక్టింగ్, సింగింగ్ ఉపయోగపడింది. అర్జున్ రెడ్డిలోని బ్రేకప్ సాంగ్ ట్యూన్ నే ఆదిత్య వర్మలో కూడా పెట్టారు. ఈ పాట్ ప్రమోషన్  వీడియోను రీసెంట్ గా రిలీజ్ చేశారు. కోలీవుడ్ లో ఇపుడు ఈ పాట గురించే మాట్లాడుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ "వర్మ" పేరుతో బాలదర్శకత్వంలో మొదలైంది. ఔట్ పుట్ బాగా రాలేదని రీ షూట్ చేశారు. వర్మ టైటిల్ ను ఆదిత్య వర్మగా మార్చారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా శిష్యుడు గిరీశయ్య దర్శకత్వంలో ఆదిత్య వర్మ రూపొందుతోంది. బాల దర్శకత్వంలో వచ్చిన ఆదిత్యవర్మ టీజర్ మెప్పించకపోయినా.. గిరీశయ్య దర్శకత్వంలో వచ్చిన టీజర్ మాత్రం అర్జున్ రెడ్డిని గుర్తు చేసింది. ధృవ్ రెండోసారి వలన ఏమోగానీ.. హీరో ఫేస్ లో యాక్షన్ రియాక్షన్ విజయ్ దేవరకొండకు దగ్గరగా ఉంది. 

ఆదిత్య వర్మ సినిమాకు టీజర్ కంటే లేటెస్ట్ గా రిలీజైన సాంగ్.. హైప్ తీసుకొచ్చింది. ఓ ప్రొఫెషనల్ సింగర్ లా పాడి ఆకట్టుకున్నాడు. రిలీజైన 24గంటల్లో 5లక్షల వ్యూస్ రాగా 40వేల మందికి పైగా లైక్ చేశారు. పెద్దగా అంచనాలు లేని ఆదిత్యవర్మపై.. ధృవ్ పాడిన ప్రమోషన్ సాంగ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది.   






మరింత సమాచారం తెలుసుకోండి: