వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు.  దేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన ముఖ్యమంత్రుల్లో జగన్ మూడో స్థానంలో నిలిచాడు.  మొదటి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఉండగా.. రెండో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.  మూడో స్థానంలో జగన్ నిలిస్తే ఐదో స్థానంలో కేసీర్ ఉండటం విశేషం.  


ప్రభాస్ కుటుంబం బీజేపీలో ఉన్నది.  ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీలో ఉన్నారు.  అయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.  ఇదిలా ఉంటె. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.  బాహుబలి సీరీస్, ఇప్పుడు సాహో తో ప్రభాస్ మరోసారి దేశంలో పేరు తెచ్చుకున్నాడు.  పాన్ ఇండియామూవీగా సాహో నిలిచింది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  


ఎప్పుడు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రభాస్, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వక తప్పడంలేదు.  అయితే, సినిమా గురించి అడిగే ప్రశ్నలకు సరిగ్గా చెప్పే ప్రభాస్, రాజకీయాల విషయాలకు మాత్రం పక్కన పెట్టేస్తారు.  ప్రభాస్ మాత్రమే కాదు సినీమా రంగంలో ఉండే ప్రముఖ హీరోలంతా రాజకీయాల గురించి అడిగినపుడు ఇలానే పక్కన పెడతారు.  కారణం ఏంటి అన్నది తరువాత సంగతి. 


మీడియా అడిగిన ప్రశ్నల్లో కొన్ని చిక్కు ప్రశ్నలు కూడా ఉన్నాయి.  అందులో ఒకటి జగన్ గురించి.  జగన్ పాలనపై మీ అభిప్రాయం ఏంటి అంటే.. జగన్ పరిపాలన బాగా చేస్తున్నాడని, రాజకీయాల గురించి తనకు పెద్దగా తెలియవని చెప్పి తప్పించుకున్నారు.  ఇలాంటి ప్రశ్నలకు నో కామెంట్స్ అని చెప్పే హీరోలు.. జగన్ గురించి అడిగిన వెంటనే పాలన బాగుంది అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి అన్నది తెలియాలి.  జగన్ కు ప్రభాస్ దగ్గరవుతున్నారు అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.  అంతేకదా మరి చూద్దాం జగన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: