లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి, ఆ తరువాత ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ.. తర్వాత వచ్చిన పెళ్లి చూపులు హిట్ అవ్వగా, ఇక అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమాతో ఫుల్ ఫామ్లోకి వచ్చిన విజయ్ ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. మొన్న ఆమధ్య వచ్చిన గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలు ఇతగాడిని ఓ రేంగులోకి తీసుకెళ్లాయి. 


ఆ సినిమాలు హిట్ అవ్వడమే కాకుండా మంచి కలెక్షణాల్తో కూడా దూసుకు పోయాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ నటించిన చిత్రం డియర్ కామ్రేట్.. ఆ సినిమాలో ఆయన మార్క్ ఎక్కడ కనిపించలేదని మాటలను మూట కట్టుకుంది. ముందు సినిమాల కన్నా భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ కుర్రాడికి అనుకున్నంత కలెక్షన్లను తీసుకురాలేక పోయింది. 


విషయానికొస్తే..  డియర్ కామ్రేడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిన సంగతి తెలిసిందే.. దానిపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విజయ్ చెవిన పడ్డాయి. దానితో స్పందించిన విజయ్ నాపై రూమర్స్ చెప్పకండి. సినీ పరిశ్రమలో గెలుపు, ఓటమిలు సహజం అంటూ వ్యాఖ్యానించారు. ఆ సినిమా గురించి ఇలాంటి కామెంట్లు చేసి ఉన్న కాస్త పరువును కూడా తీసేశారు. 


అలాంటి రూమర్లు నాకు కొత్తేమీకాదు.. వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు అని విజయ్ అన్నారు. మొన్న సైమా అవార్డులలో రెండు అవార్డులను సొంతం చేసుకున్న విజయ్ మరో సారి అందరిలో స్టార్ అయ్యారు. ప్రస్తుతం క్రాంత్ మాధవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. రీసెంటుగా పూరి కాంబినేషనలో మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: