టాలీవుడ్లో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఓ వైపు కొత్తగా వచ్చిన యూత్  హీరోలు, మరో వైపు స్టార్ డం సొంతం చేసుకున్న యంగ్ హీరోలు ఇంకో వైపు సిక్స్టీ ప్లస్ హీరోలు. ఎవరూ ఎక్కడా తగ్గడంలేదు. వీరంతా కూడా హీరోలుగానే సినిమాలు తీస్తున్నారు. రొమాన్స్ కి సై అంటున్నారు. ఆటలు, పాటలు, యాక్షన్ వంటివి అన్నీ కూడా సై అంటే సై అంటున్నారు. ఇక కలెక్షన్లు కూడా సీనియర్లు వారి రేంజిలో బాగానే లాగేస్తున్నారు.


ఇదిలావుంటే ప్రతీ ఏటా సంక్రాంతి సీజన్ సినీ హీరోలకు పెద్ద పండుగ. ఎందుకంటే ఆ టైంలో హిట్ పడితే ఏడాది అంతా ఫుల్ జోష్ ఉంటుంది. దాంతో సంక్రాంతికి తమ సినిమా పుంజుని రెడీ చేసుకోవాలనుకుంటారు. ఓ విధంగా ఇది సెంటిమెంట్ గా మారింది. ఈసారి సంక్రాంతికి కూడా రెండు పుంజులు రెడీ అయ్యాయి. సరిలేరు నీకెవ్వరూ అంటూ మహేష్ బాబు అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చేస్తున్నాడు.


మరో వైపు   త్రివిక్రం డైరెక్షన్లో అల్లు అర్జున్ మూవీ అల వైకుంఠపురంలో మూవీ రెడీగా ఉంది. ఈ రెండు మూవీస్ ఇప్పటికైతే అఫీషియల్ గా డిక్లేర్ అయ్యాయి. అయితే కనబడని మూడవ సింహంగా బాలయ్య బరిలోకి వస్తారట. బాలయ్య కేఎస్ రవికుమార్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో నిర్మాత  ఉన్నారట.


ఈ మూవీలో బాలయ్య ఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. వేదిక, సోనాలి చౌహాన్ లతో జంట కడుతున్నాడు. ఈ మూవీలో బాలయ్య పోలీస్  ఆఫీసర్ వేషం కూడా కడుతున్నాడు. లాంగ్ లాంగ్ గ్యాప్ తరువాత ఖాకీ డ్రెస్ వేయడంతో అదొక కమర్షియల్ ఎలిమెంట్ గా ఉంది. ఈ మూవీని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి క్రాంతి అన్న టైటిల్ రెడీ చేసిపెట్టుకున్నారు. పవర్ ఫుల్ స్టోరీతో సంక్రాంతి పుంజుగా బాలయ్య దూకేందుకు రెడీ అంటున్నాడు.


అయితే సంక్రాంతికి బన్నీ, మహేష్ సినిమాల మధ్య థియేటర్ల ప్రాబ్లం ఉంటుందా అన్నది నిర్మాత సి కళ్యాణ్ ఆలోచిస్తున్నారుట. బన్నీ సినిమా అనుకున్న టైం కి రిలీజ్ కాకపోతే మాత్రం ఆ గ్యాప్ లో బాలయ్య మూవీని లైన్లో పెట్టాలని కళ్యాణ్ డిసైడ్ అయ్యారని టాక్. కాకపోతే మాత్రం డిసెంబర్లో అని ఫిక్స్ అయ్యారట. బాలయ్య మాత్రం సంక్రాంతికి అని పట్టుబట్టి కూర్చున్నారుట. మరి చూడాలి బన్నీ ఆ చాన్స్ ఇస్తారా.


మరింత సమాచారం తెలుసుకోండి: