టాలీవుడ్ లో మాస్ హీరోగా కోట్లమంది అభిమానాన్ని కూడగట్టుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి.  తాను ఎంత మాస్ హీరో అయినా ప్రజలకు ప్రత్యేక్షంగా సేవ చేయలేక పోతున్నానని రాజకీయాల్లోకి వచ్చారు.  కానీ రాజకీయాల్లో ఆయన తన హీరోయిజం మాత్రం చూపించలేక పోయారు. దాంతో ఇక వెండితెరపై తన మార్క్ ఉంటుందని భావించిన మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు.


ఈ మూవీలో రైతులు నీటి సమస్యలు ఎలా ఎదురుర్కొంటున్నారు..వారికి సముచితమైన స్థానం సమాజంలో ఇవ్వడం లేదని ప్రజల్లో, మీడియా, రాజకీయ నాయకులు అందరూ వారిని పట్టించుకోవాలని కాన్సెప్ట్ తో ‘ఖైదీ నెంబర్ 150’ తెరక్కించారు.  ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ మూవీలో చిరు డబుల్ రోల్ ఇరగదీశాడు. 


మొత్తానికి రీఎంట్రీ బాక్సాఫీస్ షేక్ చేసింది..మరి తదుపరి సినిమా ఏ రేంజ్ లో హిట్ కావాలో అన్న ఆలోచనతో ఈసారి వినూత్న ప్రయోగంతో అభిమానుల ముందుకు వస్తున్నారు చిరంజీవి. బ్రిటీష్ సైన్యాన్ని గజ గజలాడించిన మొదటి తెలుగు బిడ్డ, వీర పోరాటం చేసిన స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింమారెడ్డి.  ఆయన జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి ‘సైరా నరసింహారెడ్డి’సినిమా తెరకెక్కిస్తున్నారు.  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ లుక్ అధిరిపోయేలా ఉంది. 

ఈ మద్య రిలీజ్ అయిన టీజర్ లో ఆయన ఉగ్రరూపం చూసి ఫ్యాన్స్ పూనకం వచ్చినవాళ్లలా తయారయ్యారు. తాజాగా ఈ మూవీ అఫిషియల్  టీజర్‌ను ఆగస్టు 20న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత రామ్‌ చరణ్‌  సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. టీజర్‌కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందంటూ.. పోస్టర్‌ను షేర్‌ చేశారు. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: