జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ఏం చర్చించారు.? హరికృష్ణ సంవత్సరీకం రోజు ఏం జరిగింది.? చంద్రబాబు బుజ్జగింపులతో జూనియర్ మెత్తబడ్డారా.? పార్టీ కోసం సమయం కేటాయిస్తానని చెప్పారా.? జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబు అంతరంగిక చర్చలు. అరగంట పాటు ఇద్దరు ఏం చర్చించారు. జూనియర్ మళ్లీ పార్టీలో యాక్టివ్ అవుతారా. నందమూరి హరికృష్ణ తొలి సంవత్సరీకం కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు హాజరయ్యారు.హరికృష్ణకు నివాళ్ళు అర్పించారు.


అక్కడే జూనియర్ ఎన్టీఆర్ ను పక్కకు తీసుకెళ్లి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఫోటో ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ చర్చలతో టిడిపిలో మళ్లీ జూనియర్ యాక్టివ్ అవుతారా. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారా అనే ప్రచారం మొదలైంది. అయితే అక్కడ ఎలాంటి చర్చలు జరగలేదన కొందరు చెప్తోంటే, జరిగాయని మరో వర్గం ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ గతంలో టిడిపి తరపున ప్రచారం చేశారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు. రాజకీయాల జోలికే పోలేదు. కనీసం ఎలాంటి ప్రకటనలు కూడా విడుదల చేయలేదు.


సినిమాలే లోకంగా కనిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరి సుహాసిని కూకట్ పల్లిలో టిడిపి తరపున పోటీ చేస్తే ప్రచారానికి కూడా రాలేదు. కేవలం ఆమెను గెలిపించాలని ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఐతే తాజాగా జూనియర్ తో చంద్రబాబు భేటీ ఓ కొత్త చర్చకు దారి తీసింది. గత ఎన్నికల తరువాత నుంచి కోపంగా ఉన్న జూనియర్ ను చంద్రబాబు బుజ్జగించాడు అనేది పార్టీలో ఓ వర్గం వాదన. అయితే అక్కడి ఎలాంటి చర్చలు జరగలేదని మరికొంతమంది చెప్తున్నారు. మొత్తానికి జూనియర్ కు చంద్రబాబు ఏం చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఏం సమాధానమిచ్చారు. హరికృష్ణ సంవత్సరీకం సందర్భంగా అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ రూమర్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: