అల్లు అర్జున్ అంటే మోస్ట్ ఎనర్జిటిక్ హీరో. స్టైలిష్ డ్యాన్సులతో, యాక్టింగ్ తో తనకంటూ టాలీవుడ్ లో ఓ ప్లేస్ సెట్ చేసుకున్న స్టార్ హీరో. ఈయనకు టాలీవుడ్ లోనే కాకుండా కేరళ, కర్ణాటకలో కూడా అభిమానులున్నారు. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండి అభిమానులను అలరిస్తూంటాడు. తాజాగా అల్లు అర్జున్ ఆయన కుమార్తె అల్లు అర్హల వీడియో ఒకటి నెట్టింట్లో విహారం చేస్తోంది.


 

ఈ వీడియో అల్లు అర్జున్ తన కుమార్తెను ఆడిస్తూ ఓ డైలాగ్ ను పలికించడం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఆ మధ్య ఎంతో పాపులరైన మోహన్ బాబు వాడిన పదం “ఫసక్” ను అల్లు అర్జున్ తన కూతురు చేత పలికించిన పలుకులు ముద్దులొలికిస్తున్నాయి. “ఓన్లీ వన్స్.. ఫసక్” అని బన్నీ పలుకుతుంటే తన గారాల పట్టీ కూడా “ఓన్లీ వన్స్.. ఫసక్” అంటూ ముద్దు ముద్దుగా చిన్న దువ్వెనతో బన్నీ మెడ మీద పెట్టి పలుకుతుంటే తండ్రిగా అల్లు అర్జున్ మురిసిపోతున్నాడు ఈ వీడియోలో. ఇలాంటి ఫన్నీ యాక్ట్స్ ను తన కూతురితో పలికిస్తూ అల్లు అర్జున్ ఆడుకూంటూ ఉంటాడు. గతంలో కూడా “పెద్దయ్యాక నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా..” అని అల్లు అర్జున్ అర్హను అడిగితే “చేసుకోను..” అని ముద్దు ముద్దుగా చెప్పడం అప్పట్లో వైరల్ అయింది. అలానే ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయి అందరినీ ఆకర్షిస్తోంది.

 


అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరక్షన్ లో ‘అల.. వైకుంఠపురం’ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ గ్యాప్ లో ఇలా తన కూతురుతో ఆడుకుంటున్నట్టున్నాడు బన్నీ. ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చేసే ఉద్దేశ్యంతో ఉన్న బన్నీ దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ అనే సినిమా కూడా లైన్ లో పెట్టనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: