తమిళంలో సూపర్ హిట్ సాధించిన "కణా" చిత్రాన్ని తెలుగులో కౌసల్య క్రిష్ణమూర్తి పేరుతో రీమేక్ చేసారన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ సినిమాలో లీడ్ రోల్ లో నటించిన ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలోనూ లీడ్ రోల్ లో నటించింది. నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు.


ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని  పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఆగష్టు 19 న విడుదల చేశారు. ఒక అమ్మాయి ఇండియా తరఫున క్రికెటర్ గా ఆడాలన్న తన కల కోసం పడ్డ తపన, కష్టం ప్రతిబింబించేలా ట్రైలర్ సాగింది.


ఇప్పటికే విడుదలైన ఒక పాటకి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెంచేశారు. ట్రైలర్ ఆసాంతం ఆసక్తిగా ఉంది.తన తండ్రిని సంతోషపెట్టడానికి క్రికెటర్ అవుతానని ఒక చిన్న పాప చెప్పే డైలాగ్ తో మొదలయ్యే ట్రైలర్ ‘ గవాస్కర్, సచిన్ క్రికెట్ లోకి కొడుకుల్ని పంపించారు తప్ప కూతుర్లని పంపించలేదు కదా..’, ‘ మగపిల్లలతో కలిసి మగరాయుడు లాగా బ్యాట్ ఆట ఆడతావే..’ లాంటి డైలాగులు సినిమా మీద మరింత ఆసక్తిని పెంచాయి.


రాజేంద్ర ప్రసాద్ క్రికెట్ ని ప్రేమించే రైతు కృష్ణమూర్తిగా, క్రికెటర్ అవ్వాలని పరితపించే ఆయన కూతురు కౌసల్య గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తుంది.నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్ళని కాదు… నిన్ను’, ‘ ఈ లోకం గెలుస్తానని చెప్తే వినదు.. కానీ గెలిచినా వాళ్ళు చెప్తే వింటుంది. నువ్వు ఎం చెప్పినా గెలిచి చెప్పు…’ అని శివ కార్తికేయన్ చెప్పే డైలాగులు స్ఫూ ర్తి నింపేలా ఉన్నాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రాశీ ఖన్నా హాజరవుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: