కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తమిళ హీరో కార్తీ తో  కలిసి  'రెమో'ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ డైరెక్షన్ లో 'సుల్తాన్' అనే సినిమా లో నటిస్తుంది. అయితే కొద్దీ రోజుల క్రిందట ఎగ్సైట్ మెంట్  తో ఈసినిమా టైటిల్ ను తన ఇంస్టా గ్రామ్ ఖాతా ద్వారా  లీక్ చేసింది రష్మిక.  వెంటనే  ఆ  టైటిల్ వైరల్ అయిపోయింది.  అయితే ఆమె ఫ్యాన్స్ కు  రష్మిక చేసిన పని సంతోషం తెప్పించొచ్చు కానీ  కార్తీ కి అలాగే సినిమా యూనిట్  మాత్రం  అసహనం వ్యక్తం చేశారట.  నిజానికి సినిమా టైటిల్ ను  ఫస్ట్ లుక్ పోస్టర్ తో  అఫిషియల్ గా  రిలీజ్  చేద్దామనుకున్నారు అలా  అయితే సినిమా కు హైప్ వస్తుందని  చిత్ర యూనిట్  ప్లాన్ చేసుకున్నారు. 


కానీ రష్మిక  ముందుగానే ఆ టైటిల్ ను రివీల్ చేసి వారి ప్లాన్ ను చెడగొట్టింది. దాంతో  హీరో కార్తీ తో పాటు సినిమా టీం కు రష్మిక చేసిన పని కోపం తెప్పించింది.  అయితే  ఈవిషయం లో రష్మిక  క్షమాపణలు కూడా చెప్పినట్లు సమాచారం. డ్రీం వారియర్ పిక్చర్స్  పతాకం ఫై  ఎస్ ఆర్ ప్రభు  నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ -మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే  ఏడాది  ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా ను  ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.  కాగా రష్మిక కు కోలీవుడ్ లో ఇదే మొదటి సినిమా.  ఇక ఈ సినిమాతో పాటు రష్మిక ప్రస్తుతం  తెలుగులో  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో కూడా  నటిస్తుంది.  ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్ ను పూర్తి చేసి.. రష్మిక , సుల్తాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: