2019 సంవత్సరంలో భారీ అంచనాలతో, భారీ బడ్జెట్ లతో తెరకెక్కుతున్న సినిమాలు సాహో మరియు సైరా నరసింహా రెడ్డి. కేవలం 32 రోజుల గ్యాప్ తో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలు అన్ని విషయాలలో ఒకదానిని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. సాహో మరియు సైరా రెండు సినిమాల జోనర్లు వేరు అయినప్పటికీ ప్రతి విషయంలోను ఈ రెండు సినిమాల మధ్య పోలికలు వస్తున్నాయి. 
 
సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దాదాపు రెండున్నర కోట్ల రుపాయలు ఖర్చు అయింది. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సాహోకు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతుందని తెలుస్తుంది. సాహో సినిమాకు 350 కోట్ల రుపాయలు బడ్జెట్ కాగా సైరా నరసింహారెడ్డి సినిమాకు 270 కోట్ల రుపాయలు చిరంజీవి రెమ్యూనరేషన్ కాకుండా బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఒక సినిమా ప్రభావం ఇంకో సినిమాపై ఖచ్చితంగా ఉండబోతుందని తెలుస్తుంది. 
 
సాహో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సైరా నరసింహారెడ్డికి థియేటర్ల విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దసరాకు సైరాతో పాటు వెంకీమామ సినిమా కూడా విడుదల కాబోతుంది. కాబట్టి సాహోతో పోలిస్తే సైరాకు ఎక్కువ థియేటర్లు దొరకవు. థియేటర్ల విషయంలో సైరాకు ఇబ్బందులు ఉన్నా సైరాకు దసరా సెలవులు ఉండటంతో కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉంది. 
 
సాహో సినిమాకు వినాయక చవితి రోజు రోజు సెలవు కలిసివచ్చినప్పటికీ సెలవులు ఎక్కువగా ఉంటే కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉండేది. సాహో హిట్ కావాలంటే కనీసం 400 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. సైరా హిట్ కావాలంటే 320 కోట్ల షేర్ రుపాయల వసూలు చేయాలి. భారీ టార్గెట్ లతో నెల రోజుల గ్యాప్ లో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాల్ని అందుకుంటాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: