టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమా రంగంలోకి ప్రవేశించి ఇప్పటికి 20 ఏళ్ళు దాటుతోంది. అయితే ఆయన నటించిన తొలి సినిమా రాజకుమారుడు మొదలుకొని, 2011లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన ఖలేజా సినిమా వరకు, ఆయన నటించిన చాలా సినిమాలకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించడం జరిగింది. 2000వ దశకం సమయంలో వరుసగా స్టార్ హీరోలు మొదలుకుని చిన్న హీరోలవరకు అందరి సినిమాలు చేస్తూ, మంచి హిట్స్ సాదిస్తూ విపరీతమైన క్రేజ్ సాధించిన మణిశర్మను, మరియు ఆయన అందించిన మెలోడియస్ మ్యూజిక్ ను మన తెలుగు వాళ్ళు అప్పటికీ, ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా మరచిపోలేరు అనే చెప్పాలి. 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో మణిశర్మ గారికి మరింత అనుబంధం ఉంది. రాజకుమారుడు, మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, వంటి మహేష్ కెరీర్ ని మలుపుతిప్పిన సూపర్ డూపర్ హిట్ సినిమాలకు మణిశర్మే సంగీతాన్ని అందించారు. అంతేకాక మహేష్ నటించిన కొన్ని ఇతర సినిమాలకు కూడా అద్భుతమైన మ్యూజిక్ ని అందించిన మణిశర్మను, మహేష్ అనవసరంగా ప్రక్కన పెడుతున్నారు అంటూ ఆయన ఫ్యాన్స్  ఇటీవల కొద్దిరోజులుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో కొద్దిపాటి రచ్చ చేస్తున్నారు. నిజానికి మహేష్ ఇటీవల నటించిన సినిమాలకు వరుసగా దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇస్తున్నప్పటికీ, మీరు మాత్రం మరొక్కసారి మణిశర్మ గారికి అవకాశం ఇచ్చి తీరాలి అంటూ వారు పట్టుబడుతూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల వచ్చిన నాని నటించిన జెంటిల్ మాన్, అలానే రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలకు సూపర్ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ, 

ఇంకా తనలోని పస తగ్గలేదని నిరూపించుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా టాలీవుడ్ సంగీత దర్శకుల్లో ఒక సినిమాకు ఆకట్టుకునే విధంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగల దిట్టగా మణిశర్మకు మరింత గొప్ప పేరుంది. అంతేకాక ఆయన సంగీత దర్శకుడిగా పనిచేయడం తగ్గించిన తరువాత కూడా పలు సినిమాలకు బ్యాక్ మ్యూజిక్ అందించారు మణిశర్మ. వాటిలో ఎంతో పేరు సంపాదించి సూపర్ హిట్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, టెంపర్ వంటి సినిమాలను ప్రధమంగా చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్ కె అవకాశం ఇస్తూ వస్తున్న సూపర్ స్టార్, తన ఫ్యాన్స్ కోరిక మేరకు భవిష్యత్తులో మణిశర్మకు ఎంతవరకు అవకాశం ఇస్తారో వేచి చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: