వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అతడి భార్యతో విడిపోయి చాల సంవత్సరాలు అవుతోంది. అయితే వర్మ తన భార్యతో విడిపోయినా అతడి కూతురు పెళ్ళి దగ్గర ఉండి సాంప్రదాయబద్దంగా నిర్వహించాడు. వర్మ కూతురు అమెరికాలో డాక్టర్. 

తెలుగులో గజల్స్ పాడే సంస్కృతిని మొదలు పెట్టింది గజల్ శ్రీనివాస్. కొన్ని వందల గజల్స్ స్టేజ్ షోలు ఇచ్చిన గజల్ శ్రీనివాస్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రామ్ గోపాల్ వర్మ అత్యంత సన్నిహితుడు అని చెప్పడమే కాకుండా తామిద్దరం ఇప్పటికీ తరుచూ ఎదో ఒక హోటల్ లో కలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటామని ఒక ఆసక్తికర విషయాన్ని లీక్ చేసాడు. 

ఇదే సందర్భంలో శ్రీనివాస్ రామ్ గోపాల్ వర్మ విడాకుల గురించి మాట్లాడుతూ తన వల్ల వర్మకు అతడి భార్యతో వివాదాలు వచ్చాయి అంటూ అప్పట్లో హడావిడి చేసిన ఆ వార్తలలోని అసలు నిజం బయటపెట్టాడు. వర్మ తనతో ‘ఎటాక్’ అన్న మూవీ కోసం ఒక పాట పాడించాడని చెపుతూ ఆ తరువాత వర్మ తన భార్యతో గజల్స్ వల్ల తనకు అభిప్రాయభేదాలు వచ్చాయి అంటూ అప్పట్లో వర్మ తన సన్నిహితుల వద్ద కామెంట్స్ చేయడంతో వర్మ విడాకులకు తాను కారణం అంటూ గాసిప్పులు హడావిడి చేసిన అప్పటి విషయాలను గజల్ శ్రీనివాస్ గుర్తుకు చేసుకున్నాడు. 

వర్మ భార్యకు గజల్స్ అంటే చాల ఇష్టమని అయితే వర్మకు గజల్స్ అంటే పూర్తి అయిష్టం అని చెపుతూ వర్మ భార్య తరుచూ వినే గజల్స్ వల్ల వర్మకు కోపం వచ్చిన విషయాలను బయట పెట్టాడు. అయితే వారిద్దరి మధ్యా దూరాన్ని పెంచిన గజల్స్ కారణాన్ని తన పై నెట్టి అప్పట్లో మీడియా తన పై దుష్ప్రచారం చేసిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే వర్మ గతంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్యతో తనకు ఏర్పడిన అభిప్రాయ భేదాలను గురించి వివరిస్తూ తన లాంటి మూర్కుడుని ఏ మహిళా భర్తగా అంగీకరించలేదు అంటూ ఆ ఇంటర్వ్యూలో జోక్ చేసాడు. అయితే అప్పటి వర్మ విడాకుల విషయం పై ఇప్పడు గజల్ శ్రీనివాస్ ఇంత ఆలస్యంగా స్పందించడం అత్యంత ఆశ్చర్యకరం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: