బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్  కు  గత ఏడాది థగ్స్  అఫ్ హిందుస్థాన్  భారీ షాక్ ఇచ్చింది.  భారీ అంచనాల మధ్య విడుదలైన  ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద  బోల్తా పడడంతో డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది . ఇక ఈ చిత్రం తరువాత అమీర్ హాలీవుడ్ లో విజయం సాధించిన 'ఫారెస్ట్ గంప్' అనే సినిమా రీమేక్ లో నటించాడని ఓకే చెప్పాడు.  'లాల్ సింగ్ చద్దా' అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. 



ఇక ఇటీవల ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ , తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ని కలిసి  ఈ సినిమా లో నటించవల్సిందిగా  కోరగా అందుకు విజయ్ కూడా ఓకే చెప్పాడు.  కాగా ఈ చిత్రంలో  అమీర్ కు  ఫ్రెండ్ గా కనిపించనున్నాడట విజయ్ సేతుపతి.  త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.  కాగా విజయ్ కి బాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా.  ప్రస్తుతం తమిళ , తెలుగు , మలయాళ భాషల్లో నటిస్తున్న విజయ్ ఒక్క కన్నడ లో నటిస్తే అన్ని ప్రముఖ భాషల్లో  నటించిన యాక్టర్ గా గుర్తింపు పొందనున్నాడు. 



ఇకఇదిలా ఉంటే విజయ్ సేతుపతి , మాధవన్ హీరోలుగా నటించిన విక్రమ్ వేద  బాలీవుడ్  రీమేక్ లో నటించడానికి ఇటీవల  అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.   సైఫ్ అలీ ఖాన్ ఈ రీమేక్ లో మరో హీరోగా  నటించనున్నారు.  కాగా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్రలో అమీర్ ఖాన్ నటించనుండగా మాధవన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. 




మరింత సమాచారం తెలుసుకోండి: