జులై 21వ తేదీన ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకుల్ని బాగానే అలరిస్తోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం నటి హేమ ఎలిమినేట్ కాగా రెండవ వారం జాఫర్ ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్ కాగా నాలుగవ వారం రోహిణి బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ కు ఏడుగురు బిగ్ బాస్ ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. 
 
గతవారం నామినేషన్ సమయంలో రోహిణితో చర్చించటంతో శివజ్యోతి ఈ వారం నేరుగా నామినేట్ అయింది. కెప్టెన్ అలీ బాబా భాస్కర్ ను నామినేట్ చేసాడు. రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళం, హిమజ, అషు రెడ్డి, మహేశ్ విట్టాలను బిగ్ బాస్ ఇంటి సభ్యులు నామినేట్ చేసారు. అనధికారిక ఓటింగ్ సర్వేల ప్రకారం బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, శివ జ్యోతి, హిమజ సేఫ్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
పునర్నవి, మహేశ్ విట్టా, అషు రెడ్డి చివరి స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం అషు రెడ్డి లేదా మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో మహేశ్ విట్టా, అలీ రేజా మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. శివజ్యోతి, శ్రీముఖి ఇద్దరూ వితిక, పునర్నవిని పిలిచి ర్యాగింగ్ చేస్తారు. పాట పాడమంటే వితిక, పునర్నవి గాజువాక పిల్ల పాట పాడతారు. డ్యాన్స్ చేయమంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని పాటకు ఇద్దరూ డ్యాన్స్ చేస్తారు. 
 
బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ కలిసి మాటే మంత్రము పాట పాడి వరుణ్ సందేశ్, వితిక పెళ్ళి రోజును సెలబ్రేట్ చేస్తారు. బిగ్ బాస్ ఈ వారం ఇంటి కెప్టెన్ అయ్యే అవకాశం అమ్మాయిలకు ఇస్తాడు. కన్ఫెషన్ రూమ్లో మొదటగా కూర్చున్న ఇద్దరు అమ్మాయిలకు కెప్టెన్సీ టాస్క్ ఉంటుందని బిగ్ బాస్ చెబుతాడు. శివజ్యోతి, వితిక మొదట కూర్చోవటంతో వారిద్దరికీ అవకాశం వస్తుంది. శివజ్యోతి, వితిక ఇద్దరిలో కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి శివ జ్యోతి కెప్టెన్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: