సైరా నరసింహరెడ్డి ప్రమోషన్స్ మొదలయ్యాయి. ముంబాయిలో టీజర్ రిలీజ్ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్,హిందీ రైట్స్ తీసుకున్న ఫరన్ అక్తర్ లను ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ జర్నలిస్ట్ అనుపమ చోప్రా ఇంటర్వ్యూ  చేశారు.ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయలను తెలిపారు.
 పరుచూరి బ్రదర్స్ ఈ స్టోరిని పది సంవత్సరల క్రితం చెప్పారంటా కదా ఈ సినిమా తీయడానికి ఇంతా టైమ్ ఎందుకు పట్టింది అని అనుపమ అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఈ విధంగా సమాధానం చెప్పారు..ఇది చరిత్రకు మరిచిపోయిన తోలి స్వాతంత్ర్య సమరయోధుడి కథ.ఈ కథని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాము.సైర నరసింహరెడ్ది స్టోరికి ఒక టైమ్ లేదు ఎప్పుడు ఈ సినిమా తీసిన ఆడుతుంది. కానీ ఇక్కడ సమస్య భారీ బడ్జెట్ , ఈ విషయంలో బాహుబలి ధైర్యాన్ని ఇచ్చింది. మంచి కథపై ౩౦౦కోట్లూ పెట్టిన  అవి తిరిగి వస్తాయన్న నమ్మకం వచ్చింది అని అన్నారు.


 అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుతూ..బచ్చన్ గారు నా మీద ప్రేమతోనే ఈ సినిమా ఒప్పుకున్నారు. ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఫ్లయిట్ చార్జిలు కూడా ఆయన సొంత డబ్బుతో కొనుక్కొని వచ్చారు అని అన్నారు.ఒక రోజు సెట్ కి వెళ్ళిన సురేఖ గారు మీరు చేస్తున్న యక్షన్ సీన్స్ చూసి షాక్ అయ్యి ఇంటికొచ్చి చరణ్ ని ఆయన ఎం చేస్తున్నారు అని అడిగారంట అది నిజమా అని అనుపమ అడిగిన ప్రశ్నకు చరణ్ నవ్వుతూ ఆయనకు చెప్పాడనికి మేమ్ ఎవరం ఒక్కసారి ఆయన కాస్ట్యూమ్ వేసుకున్నారంటే ఆయన ప్రపంచన్ని మరిచిపోతారు.


ముంబయిలో ఒక రిస్కీ అండర్ వాటర్ సిక్వెన్స్ మేము రెండు రోజులుగా ప్లాన్ చేస్తున్న అది సెట్ అవ్వడం లేదు. కాని డాడి అండర్ వాటర్ లోనికి దిగి చేసారు రెండు గంటల్లో ఆ సీన్ ని షూట్ చేసాం అని చెప్పారు. చిరంజీవి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కృతజ్జతలు చేప్పి ఇంటర్వ్యూ ముగించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: